Telugu Global
Cinema & Entertainment

పాప్ స్టార్ క‌న్నీరు మున్నీరైంది

ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా పారిస్ దాడులపై స్పందిస్తూ కంటతడి పెట్టింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో శనివారం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన మడోన్నా.. ఈ సందర్భంగా పారిస్ దాడుల మృతుల కోసం కొంతసేపు మౌనం పాటించింది. ఈ దాడుల్లో బాధితుల గురించి మాట్లాడుతూ ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘ఇప్పుడు ఈ షో నిర్వహించడం నాకు చాలా కష్టమైన విషయం. గత రాత్రి ఏం జరిగిందన్నది మరిచిపోలేనిది. పారిస్‌లో జరిగిన విషాదకరమైన ఉదంతంలో ఎంతోమంది విలువైన […]

పాప్ స్టార్ క‌న్నీరు మున్నీరైంది
X

ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా పారిస్ దాడులపై స్పందిస్తూ కంటతడి పెట్టింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో శనివారం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన మడోన్నా.. ఈ సందర్భంగా పారిస్ దాడుల మృతుల కోసం కొంతసేపు మౌనం పాటించింది. ఈ దాడుల్లో బాధితుల గురించి మాట్లాడుతూ ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది.

‘ఇప్పుడు ఈ షో నిర్వహించడం నాకు చాలా కష్టమైన విషయం. గత రాత్రి ఏం జరిగిందన్నది మరిచిపోలేనిది. పారిస్‌లో జరిగిన విషాదకరమైన ఉదంతంలో ఎంతోమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిశాయి’ అని 51 ఏళ్ల మడోనా పేర్కొంది. ‘ఒకవైపు తమవారిని కోల్పోయి బాధితులు దుఃఖిస్తుంటే.. ఇక్కడ నేను ఎందుకు డాన్స్ చేస్తున్నానంటే.. దాడులు చేసినవారి లక్ష్యం మన నోళ్లు మూయించడమే. మనల్ని మౌనంగా ఉంచడమే. అది ఎప్పటికీ జరుగదని నిరూపించడానికి నేనిప్పుడు షో కొనసాగిస్తున్నాను’ అని మడోన్నా తెలిపింది. ఈ సందర్భంగా విషాదస్మృతి గీతమైన ‘లైక్ ఏ ప్రేయర్’ గీతాన్ని ఆలపించి.. మడోన్నా పారిస్ పేలుళ్ల మృతులకు నివాళులర్పించింది.

First Published:  16 Nov 2015 7:09 PM GMT
Next Story