Telugu Global
Cinema & Entertainment

సావిత్రి కోసం నైట్ షిఫ్ట్ చేస్తున్న నారా రోహిత్

వరుసగా సినిమాలు కమిటవ్వడం కాదు, చెప్పిన టైమ్ కు షూటింగ్ పూర్తిచేయాలి. అప్పుడే నిర్మాతల హీరోగా ఓ మంచి పేరు దక్కుతుంది. ప్రస్తుతం నారా రోహిత్ అలా నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. సోలో మినహా సరైన సక్సెస్ కొట్టలేకపోయిన ఈ హీరో, ఈమధ్య కాలంలో ఒకేసారి అరడజను సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ చేయడం కోసం నైట్ షిఫ్టులు కూడా చేస్తున్నాడు నారా […]

సావిత్రి కోసం నైట్ షిఫ్ట్ చేస్తున్న నారా రోహిత్
X
వరుసగా సినిమాలు కమిటవ్వడం కాదు, చెప్పిన టైమ్ కు షూటింగ్ పూర్తిచేయాలి. అప్పుడే నిర్మాతల హీరోగా ఓ మంచి పేరు దక్కుతుంది. ప్రస్తుతం నారా రోహిత్ అలా నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. సోలో మినహా సరైన సక్సెస్ కొట్టలేకపోయిన ఈ హీరో, ఈమధ్య కాలంలో ఒకేసారి అరడజను సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటిలో ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ చేయడం కోసం నైట్ షిఫ్టులు కూడా చేస్తున్నాడు నారా రోహిత్.
ప్రస్తుతం ఈ నారా వారి హీరో రాజా చేయి వేస్తే అనే మూవీతో పాటు సావిత్రి అనే మరో డిఫరెంట్ మూవీని ఫ్లోర్స్ పైకి తీసుకొచ్చాడు. వీటిలో రాజా చేయివేస్తే సినిమా షూటింగ్ ను జనరల్ షిఫ్ట్ లో పూర్తిచేస్తున్నాడు. ఇక చీకటి పడిన వెంటనే సావిత్ర షిఫ్ట్ లోకి చేరిపోతున్నాడు. రాత్రంతా ఆ సినిమా షూటింగ్ చేయడంతోపాటు.. అవసరమైతే మార్నింగ్ షిఫ్ట్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఆ వెంటనే ఫ్రెష్ అయి టిఫిన్ చేసి తిరిగి రాజాచేయివేస్తే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఇలా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు నారా రోహిత్. కనీసం ఈ సారైనా లావు తగ్గుతాడేమో చూడాలి.
First Published:  16 Nov 2015 7:05 PM GMT
Next Story