Telugu Global
NEWS

చేనేత కార్మికుల రుణ మాఫీకి రూ. 110 కోట్లు

25,567 మంది చేనేత కార్మికుల రుణ మాఫీకి రూ. 110 కోట్ల రూపాయలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ఓడ రేవుల విధానాన్ని రూపొందించడానికి, కొన్ని రేవుల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం… ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయాలని, అన్ని […]

చేనేత కార్మికుల రుణ మాఫీకి రూ. 110 కోట్లు
X

25,567 మంది చేనేత కార్మికుల రుణ మాఫీకి రూ. 110 కోట్ల రూపాయలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సుదీర్ఘంగా ఏడు గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త ఓడ రేవుల విధానాన్ని రూపొందించడానికి, కొన్ని రేవుల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గం… ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల నిర్వహణను అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ల పరీక్షలను ఆస్పత్రులలో ఉచితంగా ప్రజలకు అందించాలని నిర్ణయించింది.

రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతం వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి తగిన విధంగా సిఫార్సులు చేయడానికి ఐదుగురు మంత్రులతో కమిటీ వేయాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. తుపాను భీభత్సంతో అతలాకుతలమైన జిల్లాల్లో సమీక్ష జరపడానికి కేబినెట్‌ ఐదుగురు సభ్యులతో కమిటీని రూపొందించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు చినరాజప్ప, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూరు జిల్లాకు మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, కడప జిల్లాకు మంత్రి గంటా శ్రీనివాసరావును నియమించారు.

First Published:  16 Nov 2015 1:09 PM GMT
Next Story