Telugu Global
NEWS

సెంటిమెంట్‌నే న‌మ్ముకున్న కేసీఆర్‌

మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం మొద‌లైన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ సెంటిమెంట్‌నే న‌మ్ముకుంటూ వ‌స్తున్నారు.  2001లో పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి తాజా వ‌రంగ‌ల్ ఉప-ఎన్నిక ప్ర‌చారం వ‌ర‌కు ఆయ‌న అస్త్రం ఒక్క‌టే… తెలంగాణ సెంటిమెంట్‌! ఇప్పుడు కూడా అదే ఆయుధాన్ని ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌, ఇత‌ర పార్టీలు తెలంగాణ విష‌యంలో వేసిన పిల్లిమెగ్గ‌లు, క‌ప్ప‌దాట్లు ప్ర‌స్తుతం కేసీఆర్ చేతిలో అస్త్రాలుగా మారుతున్నాయి. వీటితోనే అధికార‌పార్టీపై ముప్పేట దాడి చేస్తోన్న ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనే ప‌నిలో ప‌డ్డారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ప‌త్తి […]

సెంటిమెంట్‌నే న‌మ్ముకున్న కేసీఆర్‌
X
మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం మొద‌లైన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ సెంటిమెంట్‌నే న‌మ్ముకుంటూ వ‌స్తున్నారు. 2001లో పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి తాజా వ‌రంగ‌ల్ ఉప-ఎన్నిక ప్ర‌చారం వ‌ర‌కు ఆయ‌న అస్త్రం ఒక్క‌టే… తెలంగాణ సెంటిమెంట్‌! ఇప్పుడు కూడా అదే ఆయుధాన్ని ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌, ఇత‌ర పార్టీలు తెలంగాణ విష‌యంలో వేసిన పిల్లిమెగ్గ‌లు, క‌ప్ప‌దాట్లు ప్ర‌స్తుతం కేసీఆర్ చేతిలో అస్త్రాలుగా మారుతున్నాయి. వీటితోనే అధికార‌పార్టీపై ముప్పేట దాడి చేస్తోన్న ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనే ప‌నిలో ప‌డ్డారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ప‌త్తి రైతు మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌ల‌ను ఉతికి ఆరేశారు!
కేసీఆర్ మాట‌ల మాంత్రికుడు. గుక్క‌తిప్పుకోకుండా అన‌ర్గ‌ళంగా, క‌ళాత్మ‌కంగా మాట్లాడ‌టం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అందుకే వ‌రంగ‌ల్ ప్ర‌చారంలో ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో ఉతికి ఆరేస్తున్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ప‌త్తికి మద్ద‌తు ధ‌ర విష‌యంలో బీజేపీనే ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాడు కేసీఆర్‌. మ‌ద్ద‌తు ధ‌ర కేంద్ర ప‌రిధిలో ఉంటుంద‌న్న విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెబుతున్నారు. ఆపార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి తెలంగాణ ఉద్య‌మం సమ‌యంలో రాజీనామా చేయ‌కుండా పారిపోయి.. ఇప్పుడు ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో భంగ‌ప‌డ్డారు. బీహార్‌లో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. అలాంటి పార్టీ ఇప్పుడు తెలంగాణ‌లో ఎలా పోటీ చేస్తోంది? 16 నెల‌ల్లో వీరు దేశంలో సాధించిన అభివృద్ధి ఏంటి? అని బీజేపీని సూటిగా ప్ర‌శ్నించారు. అమ్మ‌కు అన్నం పెట్ట‌డు కానీ చిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టుగా ఉంది బీజేపీ ప‌రిస్థితి అని కేసీఆర్ విమ‌ర్శిస్తున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌డం చేత‌గాదు గానీ వ‌రంగ‌ల్‌ను మాత్రం ఎలా అభివృద్ధి చేస్తారు? అని ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక‌పోతే త‌న‌పై ఒంటికాలిపై లేస్తున్న కాంగ్రెస్ నేత‌లు జానారెడ్డి, జైపాల్ రెడ్డిల‌ను సైతం వ‌ద‌ల్లేదు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డంపెట్టుకుని మంత్రి ప‌ద‌వులు వ‌చ్చిన వెంట‌నే.. ఉద్య‌మాన్ని విడిచి వెళ్లిన వారికి త‌న‌ను విమ‌ర్శించే హ‌క్కు లేదని స్ప‌ష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మా చేతుల్లోనే ఉంది కాబ్ట‌టి మాకే ఓటేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం నా ప్రాణాలు లెక్క‌చేయ‌కుండా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే.. వ‌చ్చింద‌ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
First Published:  17 Nov 2015 11:37 PM GMT
Next Story