Telugu Global
Others

అరెస్టుల వెనుక అసలు వ్యూహం ఏమిటి?

రాజకీయ రాజధానిగా, ఆర్ధిక రాజధానిగా పేరొందిన కృష్ణాజిల్లాలో ఇపుడు తెలుగుదేశం పార్టీ కొత్త పాచికలు వేస్తోంది. అమరావతి రాజధాని అయిన తర్వాత తెలుగుదేశంపార్టీ స్థానికంగా బలం పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. అడ్డువచ్చిన ప్రతిపక్షాలపై కేసులు,జైళ్లకు పంపడం వంటి చర్యలకు పాల్పడుతోంది. దీనికికారణం సొంతబలంపై నమ్మకం లేకపోవడమే. కొన్నినియోజకవర్గాల్లో ఇప్పటికీ ఎదురీదడమే ప్రధానకారణంగా పేర్కొనాల్సి ఉంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అనేక విధాలుగా వైసిపి అభ్యర్థుల్ని ప్రలోభపెట్టి తనవైపునకు లాక్కునే ప్రయత్నాలు చేసిన టీడీపీ అవేమి పనిచేయకపోయే […]

అరెస్టుల వెనుక అసలు వ్యూహం ఏమిటి?
X

రాజకీయ రాజధానిగా, ఆర్ధిక రాజధానిగా పేరొందిన కృష్ణాజిల్లాలో ఇపుడు తెలుగుదేశం పార్టీ కొత్త పాచికలు వేస్తోంది. అమరావతి రాజధాని అయిన తర్వాత తెలుగుదేశంపార్టీ స్థానికంగా బలం పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. అడ్డువచ్చిన ప్రతిపక్షాలపై కేసులు,జైళ్లకు పంపడం వంటి చర్యలకు పాల్పడుతోంది. దీనికికారణం సొంతబలంపై నమ్మకం లేకపోవడమే. కొన్నినియోజకవర్గాల్లో ఇప్పటికీ ఎదురీదడమే ప్రధానకారణంగా పేర్కొనాల్సి ఉంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అనేక విధాలుగా వైసిపి అభ్యర్థుల్ని ప్రలోభపెట్టి తనవైపునకు లాక్కునే ప్రయత్నాలు చేసిన టీడీపీ అవేమి పనిచేయకపోయే సరికి ఇపుడు కేసుల వరకూ వెళ్లి,భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. బలమైన కొన్ని నియోజకవర్గాల్లో భయకంపితుల్ని చేసి,స్థానికంగా ఉన్న వైసిపి కేడర్‌ను తనవైపుకు తిప్పుకోవాలనే కుటిల యత్నాలుచేస్తోంది.దీనిలో భాగంగానే వైసిపికి కంచుకోటగా ఉన్న గుడివాడ,బందరు నియోజకవర్గాలపై గురిపెట్టింది. స్థానికంగాఉన్న వైసిపి నేతలపై కేసులు,అరెస్టులు,జైలు వంటి అంశాలకు తెరతీసింది.

‘దేశం’గుబులేమిటి?
కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం బొటాబొటి మెజార్టీతో గడచిన ఎన్నికల్లో గెలుపొందింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలకంటే కూడా స్థానిక నాయకత్వంపైనే ప్రజలకు ఎక్కువ విశ్వాసం ఉంది. ఇలాంటివే గుడివాడ,బందరు అసెంబ్లీ స్థానాలు. కొడాలి నాని గడచిన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గుడివాడనుంచిగెలుపొందుతున్నారు. గతంలోరెండుసార్లు తెలుగుదేశంనుంచి,2014లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు.ఇక్కడ నానిని కాదని మరో అభ్యర్థి గెలుపొందే పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవనేచెప్పాలి. కారణం నాని విపరీతమైన ప్రజాసేవ చేస్తున్నారని కాదు…మిగతా నాయకులు ఆయన కంటే అథమంగా ఉండటమే. బలమైన సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న గుడివాడలో ఏపార్టీకీ సరైన నాయకత్వం లేదు.బిసి సామాజికవర్గం కూడా బలంగా ఉన్న గుడివాడలో కఠారి ఈశ్వర్‌కుమార్‌ తర్వాత ధీటైన బిసి నాయకుడు లేకుండా పోయాడు. కఠారి కూడా వేర్వేరు ప్రయోగాలు చేయడం వల్ల ప్రజావిశ్వాసాన్ని పోగొట్టుకున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలన్నీకూడా బలమైన కమ్మ సామాజిక వర్గంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు తెలుగుదేశంలోగానీ,ఇటు వైసిపిలో గానీ కమ్మ సామాజిక వర్గమే పోటీలో ఉంది.గతంలో తెలుగుదేశంలో కొడాలి నాని ఉన్నపుడు గెలిపించిన గుడివాడ ఓటర్లు,వైసిపిలోనూ గెలిపించారు. ఇక్కడ నుంచి పిన్నమనేని వెంకటేశ్వరరావు,రావి వెంకటేశ్వరరావులు కూడా కొడాలినానిపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పిన్నమనేని కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చారు. రావి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వచ్చారు. అదే విధంగా కొడాలినాని టీడీపీ నుంచి వైసిపిలోకి వచ్చారు. ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.ఇలాంటి పరిస్థితుల్లో ఆయా అభ్యర్థులు పార్టీల కంటే కూడా వారి వ్యక్తిగతమైన ఇమేజ్‌ ఆధారంగానే విజయం సాధించే పరిస్థితులు గుడివాడలో నెలకొన్నాయి. ఇదే మంత్రం కొడాలి నానికి పనిచేస్తోంది. కొడాలినాని పార్టీతోసంబంధం లేకుండా తనుఏపార్టీలో ఉన్నా ప్రజావిశ్వాసాన్ని పొందేలాపరిస్థితుల్ని సొంతంచేసుకున్నారు.

బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాపుసామాజిక వర్గానికిచెందిన పేర్ని రాజకీయ కుటుంబంనుంచి వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది..విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. మాస్‌ లీడర్‌గా పేరొందిన నాని కొన్నికారణాల వల్ల గడచిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినా ప్రజామద్దతు ఆయనకే ఉంది. ఇప్పటికీ పేర్ని అంటే సాదరంగాఆహ్వానించి,ఆదరించేవారు బందరు నియోజకవర్గంలో ఎక్కువే ఉన్నారు. చిన్నప్పటి నుంచీ రాజకీయాలను దగ్గరనుంచి చూసిన పేర్ని మాస్‌ లీడర్‌గానే ఎదిగారు…కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు బందరు పోర్టు ఉద్యమం సాగుతోంది. బలవంతంగా భూసేకరణకు ప్రభుత్వం పూనుకొంటోంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది…ప్రతిపక్షానికి రాజకీయ మేలు చేసే అంశం. దీంతో ప్రభుత్వం మేల్కొంది.బలమైన ప్రతిపక్షంగా,మాస్‌లీడర్‌గా ఉన్న పేర్నిని అదుపు చేయకపోతే బందరు కోటలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భావించింది. పోర్టు ఉద్యమం,బార్‌షాపుదగ్గర జరిగిన చిన్న అంశాన్ని సాకుగా చూపి పేర్నిని అరెస్టు చేశారు. రిమాండ్‌కు పంపారు.

అరెస్టులు ఎందుకు?
కృష్ణాజిల్లాలో మొత్తం 16అసెంబ్లీనియోజకవర్గాలుఉంటే వాటిల్లో5నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులు గెలుపొందారు. గుడివాడ, పామర్రు, నూజివీడు, తిరువూరు, విజయవాడపశ్చిమ నియోజకవర్గాలకు వైసిపి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. ఇన్నినియోజకవర్గాల్లో వైసిపి రావడంఅనేది తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అంతుబట్టని విషయంగామారింది.వీటిసంఖ్యను తగ్గించాలనే వ్యూహంతోనే ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ దేశం నాయకత్వం ఆలోచనచేస్తోంది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకొనేప్రయత్నాలు చేసింది కూడా. కానీ ఆ పాచికలుపారలేదు. అప్పటి నుంచీ ఇప్పటికీ ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.కానీ పార్టీఫిరాయింపులు సాధ్యం కావడం లేదు. దీంతో బలమైన నాయకత్వం ఉన్న బందరు,గుడివాడలపై గురిపెట్టారు. బెదిరింపు ధోరణి అవలంబించి తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నాల్లో భాగంగానే కేసులు,అరెస్టులు వంటి అరాచకాలు.మరో వైపు వైసిపి ఎమ్మెల్యేలు తమవైపువస్తున్నారని, దేశం పార్టీలో చేరిపోతున్నారని ఏడాదిన్నర నుంచీ ప్రచారంచేస్తూనే ఉన్నారు.అయినా ఇప్పటికీ ఐదుగురిలో ఒక్క ఎమ్మెల్యే కాదు కదా వైసిపికిచెందిన ఒక్క నాయకుడూ చేరలేదు. ఇది తెలుగు తమ్ముళ్లకు అంతుబట్టడం లేదు. ఇక బతిమిలాడి ప్రయోజనం లేదని భావించారు. బెదిరింపు ధోరణే ఆఖరు మార్గంఅనుకున్నారు. యుద్దాన్ని ఆరంభించారు. కానీ దీన్లోనూ తెలుగుదేశం వ్యూహం సఫలీకృతం కాలేదనే చెప్పాలి. దేశం వ్యూహం వల్ల వైసిపి కి మేలు,టీడీపీ కి కీడు జరిగినట్లుగానే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. రేపే ఎన్నికలన్నట్లుగా తెలుగుదేశం నాయకత్వం ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.దీనివల్ల వైసిపి పట్ల సానుభూతి మరింత రెట్టింపు అవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టాన్నే మిగులుస్తుంది.

First Published:  18 Nov 2015 12:29 AM GMT
Next Story