Telugu Global
International

భయంభయంగా అమెరికా ముస్లింలు

ఫ్రాన్స్ లో ఐసిస్ తీవ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో అగ్రదేశాల్లో నివసిస్తున్న ముస్లింలు భయం భయంగా బతుకున్నారు. ఎప్పుడు ఎవరు తమపై దాడి చేస్తారోనని భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ముస్లింలను ఆదేశ పౌరులు అనుమానాస్పదంగా చూస్తున్నారట. మరికొందరు అమెరికన్లయితే కనిపించిన ముస్లింలంతా తీవ్రవాదులు అనుకుని వారిపై దాడులు చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే ఆన్ లైన్లో కూడా అమెరికాలోని ముస్లింలను ఉద్దేశించి రకరకాల పోస్టులు పెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మందికి బెదిరింపు […]

భయంభయంగా అమెరికా ముస్లింలు
X

ఫ్రాన్స్ లో ఐసిస్ తీవ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో అగ్రదేశాల్లో నివసిస్తున్న ముస్లింలు భయం భయంగా బతుకున్నారు. ఎప్పుడు ఎవరు తమపై దాడి చేస్తారోనని భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ముస్లింలను ఆదేశ పౌరులు అనుమానాస్పదంగా చూస్తున్నారట. మరికొందరు అమెరికన్లయితే కనిపించిన ముస్లింలంతా తీవ్రవాదులు అనుకుని వారిపై దాడులు చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే ఆన్ లైన్లో కూడా అమెరికాలోని ముస్లింలను ఉద్దేశించి రకరకాల పోస్టులు పెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మందికి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి.

దీనంతటికీ పారిస్ పై ఉగ్రదాడే కారణం అంటున్నారు. అమెరికాలోని ట్విన్ టవర్లపై దాడి తరహాలోనే పారిస్ పై దాడిని పోల్చి చూస్తున్నారట. దీనికి తోడు తమ నెక్ట్స్ టార్గెట్ అమెరికానేనని ఐసిస్ ప్రకటించడం కూడా ఇక్కడి ప్రజల్లో ముస్లింల పట్ల ఆగ్రహం పెరిగిపోతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముస్లింలు గడపదాటి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అయితే ఉగ్రవాదులు ముస్లింలు అయినంత మాత్రాన వారితో ఇస్లాంకు సంబంధం లేదని.. ఇస్లాంలో ఇలా అరాచకాలకు పాల్పడాలని ఎక్కడా చెప్పలేదంటూ ఉగ్రవాదులకు నిరసన తెలిపారు..

ఈ విషయాన్ని అమెరికన్ ఇస్లామిక్ సంబంధాల సంస్థ ప్రతినిధి ఇబ్రహీ హూపర్ కూడా అంగీకరించారు. అయితే దీనికి కొందరు రాజకీయ నాయకులు కూడా ఆజ్యం పోస్తున్నారని ప్రజల్లో విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద పారిస్ పై దాడి, ఐసిస్ ఉగ్రమూకలు చేస్తున్న మారణహోమం కారణంగా ఇప్పుడు అమెరికా సహా ఇతర అగ్రదేశాల్లో ఉంటున్న ముస్లింలకు పెద్ద చిక్కు వచ్చి పడింది.

First Published:  18 Nov 2015 11:13 PM GMT
Next Story