Telugu Global
NEWS

లింగంపై తేలు...! ఇలా కూడా తిట్టుకోవాలా?

నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు మానేసి వ్యక్తిగతంగా తిట్టిపోసుకుంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరిన వేళ ఈ తిట్ల తీవ్రత మరింతపెరిగింది. కేసీఆర్‌ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి… బుధవారం హన్మకొండలో జరిగిన ప్రచారసభలో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ శివలింగంపై తేలు లాంటి వాడని… అతడిని ముట్టుకోలేం, చెప్పుతో కొట్టలేం అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. తెలంగాణ శివలింగాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రేవంత్. అంతేకాదు […]

లింగంపై తేలు...! ఇలా కూడా తిట్టుకోవాలా?
X

నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు మానేసి వ్యక్తిగతంగా తిట్టిపోసుకుంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరిన వేళ ఈ తిట్ల తీవ్రత మరింతపెరిగింది. కేసీఆర్‌ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి… బుధవారం హన్మకొండలో జరిగిన ప్రచారసభలో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ శివలింగంపై తేలు లాంటి వాడని… అతడిని ముట్టుకోలేం, చెప్పుతో కొట్టలేం అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. తెలంగాణ శివలింగాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రేవంత్.

అంతేకాదు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆనాటి మహాత్ముడికి మందు వాసన కూడా తెలియదని … కేసీఆర్‌ మాత్రం ఫాంహౌజ్‌లో పడుకుని నిత్యం మందుకొడుతారని చెప్పారు. రెండేస్తే నిలబడలేరు… నాలుగేస్తే కూర్చోలేరని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కనపడేసి దద్దమ్మలను పక్కలో పెట్టుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ కారులో నాలుగు సీట్లే ఉన్నాయని, ఆ నాలుగు సీట్లను కూడా తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు ఆక్రమించుకున్నారని సెటైర్ వేశారు. అయితే రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా… మరీ ఈ స్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.

First Published:  18 Nov 2015 9:11 PM GMT
Next Story