Telugu Global
CRIME

అందాల రాక్షసి

చూడ్డానికి అందంగా ఉన్న ఈమె పేరు హస్నా ఐతబౌలాచ్‌. చూడ్డానికి మామూలుగానే ఉన్నా ఈమెలో ఒక నరరూప రాక్షసురాలు దాగి ఉంది. ఈమె కరుగట్టిన టెర్రరిస్ట్. అంతేకాదు పార్టీ గర్ల్‌ అయిన ఈమె ఉగ్రవాదిగా మారి పారిస్‌ ఉగ్రదాడిలో కీలకపాత్ర పోషించింది. దాడి తర్వాత తప్పించుకుపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తుండగా హస్నా… సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుగా సమాచారం అందింది. అక్కడివెళ్లిన పోలీసులు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. పోలీసులను నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని […]

అందాల రాక్షసి
X

చూడ్డానికి అందంగా ఉన్న ఈమె పేరు హస్నా ఐతబౌలాచ్‌. చూడ్డానికి మామూలుగానే ఉన్నా ఈమెలో ఒక నరరూప రాక్షసురాలు దాగి ఉంది. ఈమె కరుగట్టిన టెర్రరిస్ట్. అంతేకాదు పార్టీ గర్ల్‌ అయిన ఈమె ఉగ్రవాదిగా మారి పారిస్‌ ఉగ్రదాడిలో కీలకపాత్ర పోషించింది. దాడి తర్వాత తప్పించుకుపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తుండగా హస్నా… సెయింట్ డెనిస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుగా సమాచారం అందింది. అక్కడివెళ్లిన పోలీసులు అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు.

పోలీసులను నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని గ్రహించిన హస్నా తనను తాను పేల్చుసుకుంది. పోలీసుల ఆరా తీయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హస్నాకు లేని అలవాటు లేదు. నిత్యం మందుకొడుతుందని సోదరుడు చెప్పారు. సిగరేట్లు తాగడం ఇష్టానుసారం తిరగడం చేసేదట. అబ్బాయిలతో పాటు పబ్‌లు, పార్టీలకు తిరిగేది. ఆమె ఉన్న అపార్గ్‌మెంట్‌లో కొన్ని ఫోటోలు కూడా భద్రతా దళాలకు దొరికాయి.

ఉగ్రవాదిగా మారిన ఈమెకు మత విశ్వాసాల పట్ల కాస్త కూడా నమ్మకం లేదు. కేవలం పరిచయాల కారణంగానే ఉగ్రవాదులతో చేతులు కలిపిందని చెబుతున్నారు. సెయింట్ డెనిస్‌లో పోలీసులు అపార్ట్‌మెంటును చుట్టుముట్టగానే తొలుత కాల్పులు ప్రారంభించింది హస్నానేనని భావిస్తున్నారు. పోలీసులను తప్పు దారి పట్టించేందుకు తొలుత తనను కాపాడమంటూ కేకలు వేసింది. ఒకవేళ పోలీసులు దగ్గరకు వెళ్తే సూసైడ్‌ బాంబు పేల్చుకోవడం ద్వారా పోలీసులను కూడా చంపేయాలనుకుంది. కానీ భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో చివరకు ఆమె మాత్రమే సూసైడ్ బాంబుపేల్చుకుని చనిపోయింది.

First Published:  20 Nov 2015 11:07 AM GMT
Next Story