Telugu Global
Others

వైట్‌ హౌస్‌ని పేల్చేస్తారట..!

ఐఎస్ఐఎస్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడుతోంది. వారం రోజులుగా ఫ్రాన్స్ ముఖ్య పట్టణం పారిస్ లో ప్రాణ నష్టంతోపాటు విధ్వంసం సృష్టించిన ఐసిస్ ఉగ్రవాదులు ఆతర్వాత కూడా నరమేధం సృష్టిస్తూనే ఉన్నారు. ఈసారి ఐసిస్ టెర్రరిస్టు మూకలు పశ్చిమ ఆఫ్రికాను టార్గెట్ చేశాయి. మాలి రాజధాని బమాకోలో రక్తపాతం సృష్టించారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌లోకిచొరబడి 170మంది టూరిస్టులను బందీలుగా తీసుకున్నారు. పది మంది ఉగ్రవాదులు చెలరేగిపోయారు. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో 27మంది […]

వైట్‌ హౌస్‌ని పేల్చేస్తారట..!
X

ఐఎస్ఐఎస్.. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడుతోంది. వారం రోజులుగా ఫ్రాన్స్ ముఖ్య పట్టణం పారిస్ లో ప్రాణ నష్టంతోపాటు విధ్వంసం సృష్టించిన ఐసిస్ ఉగ్రవాదులు ఆతర్వాత కూడా నరమేధం సృష్టిస్తూనే ఉన్నారు. ఈసారి ఐసిస్ టెర్రరిస్టు మూకలు పశ్చిమ ఆఫ్రికాను టార్గెట్ చేశాయి. మాలి రాజధాని బమాకోలో రక్తపాతం సృష్టించారు. బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్‌లోకిచొరబడి 170మంది టూరిస్టులను బందీలుగా తీసుకున్నారు. పది మంది ఉగ్రవాదులు చెలరేగిపోయారు. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో 27మంది చనిపోయారు.

ఈ విధ్వసం కొనసాగుతుండగానే ఐసిస్ మరోసారి హెచ్చరిక చేస్తూ వీడియోను విడుదల చేశారు. 6 నిమిషాల వీడియోలో ఫ్రాన్స్ తో మొదలు పెట్టాం. మా యుద్ధం వైట్ హౌస్‌గా పిలుచుకునే భవనంతో ముగిస్తాం’ అంటూ ఓ ఫైటర్ వెల్లడించాడు. ‘మేము దాన్ని పేల్చేస్తాం. ఎలాగైతే ఇతర భవనాలను పేలుస్తున్నామో అలాగే వైట్ హౌస్ నూ పేల్చేస్తాం. ఇందుకోసం మా సూసైడ్ బెల్టులు, కారు బాంబులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మేమూ రాగలమంటూ’ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి హెచ్చరించారు.

అయితే ఐసిస్ హెచ్చరికలను అమెరికా కొట్టిపారేసింది. పారిస్ తరహా దాడులకు అమెరికాలో అవకాశం ఉందని భావించడం లేదని.. కేవలం ప్రచారం కోసమే ఐసిస్ ఈ తరహా వీడియోలు విడుదల చేస్తున్నారని ఎఫ్‌బిఐ డైరెక్టర్ జేమ్స్ అన్నారు.

First Published:  21 Nov 2015 12:09 AM GMT
Next Story