Telugu Global
Others

చంపుతానని హెచ్చరించినా.. ఊతపదమంటూ ఊరుకున్నారు

మేయర్ అనురాధ దంపతులకు మేనల్లుడు చింటూ నుంచి ముందే హెచ్చరికలు అందినట్టు వారి అనుచరులు వెల్లడిస్తున్నారు. మేయర్ దంపతుల తీరు నచ్చట్లేదు… చూస్తూ ఉండండి . వారిని చంపేస్తా అంటూ చింటూ పదేపదే పలువురు నేతలు, అనుచరుల దగ్గర అనేవాడని చెబుతున్నారు. అయితే ఏనాయకుడు కూడా చింటూను మందలించడం గానీ.. మేయర్ దంపతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం గానీ చేయలేదంటున్నారు. మేయర్ దంపతులకు, చింటూకు మధ్య అంతర్గత యుద్దం జరుగుతోందన్న విషయం పార్టీలోని ప్రతినాయకుడికి తెలుసని […]

చంపుతానని హెచ్చరించినా.. ఊతపదమంటూ ఊరుకున్నారు
X

మేయర్ అనురాధ దంపతులకు మేనల్లుడు చింటూ నుంచి ముందే హెచ్చరికలు అందినట్టు వారి అనుచరులు వెల్లడిస్తున్నారు. మేయర్ దంపతుల తీరు నచ్చట్లేదు… చూస్తూ ఉండండి . వారిని చంపేస్తా అంటూ చింటూ పదేపదే పలువురు నేతలు, అనుచరుల దగ్గర అనేవాడని చెబుతున్నారు. అయితే ఏనాయకుడు కూడా చింటూను మందలించడం గానీ.. మేయర్ దంపతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం గానీ చేయలేదంటున్నారు.

మేయర్ దంపతులకు, చింటూకు మధ్య అంతర్గత యుద్దం జరుగుతోందన్న విషయం పార్టీలోని ప్రతినాయకుడికి తెలుసని టీడీపీ వారు అంటున్నారు. జిల్లాకు చెందిన పెద్ద నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను కూర్చొబెట్టి మాట్లాడి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదంటున్నారు. జిల్లాకుచెందిన నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడానికి కారణం కూడా చెబుతున్నారు. ఒకటిరెండుసార్లు జిల్లా నాయకుల మాటను మేయర్ దంపతులు పట్టించుకోలేదని… అప్పటి నుంచి వారు కూడా మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. మేయర్ తీరు నచ్చని కొందరు నేతలు చింటూను రెచ్చగొట్టారని కూడా చెప్పుకుంటున్నారు.

మేయర్‌ను చంపేస్తానంటూ చింటూ పదేపదే చెబుతున్న మాటలను కొందరు కటారి మోహన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ”చంపేస్తా” అనడం చింటూకు ఊతపదం లాంటిదంటూ లైట్‌గా తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెచ్చిందంటున్నారు.

మరోవైపు మేయర్, చింటూ మధ్య ఈస్థాయిలో వార్ నడుస్తున్నా దాన్ని గుర్తించడంలో ఇంజెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితిని గమనించి మేయర్‌కు గన్‌మెన్‌లను కేటాయించి ఉంటే హంతకులు ఇంత ధైర్యంగా దారుణానికి ఒడిగట్టేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: హత్యలో కార్పొరేటర్ల హస్తం.. బురఖాలు కొనింది వారే!

First Published:  22 Nov 2015 3:32 AM GMT
Next Story