Telugu Global
International

2నెలలు ఫేస్ బుక్ కు జుకర్ బర్గ్ దూరం

దేశానికి రాజైనా పిల్లలకు మాత్రం తండ్రే. తండ్రి అవుతున్నామన్న ఆనందం అనుభవిస్తేనే కాని తెలియదంటారు. సిలికాన్‌ వ్యాలీలో అత్యంత శక్తివంతమైన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ కూడా ఆ ఆనంద క్షణాలను అనుభవించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే తనకు, ప్రిసిల్లాకు త్వరలోనే ఆడబిడ్డ పుట్టబోతోందని.. కూడా ఫేస్ బుక్ లో జుకర్ ప్రకటించాడు.  ఇందుకోసం ఎంతో బిజీగా ఉండే జుకర్ బర్గ్ ఏకంగా రెండు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత […]

2నెలలు ఫేస్ బుక్ కు జుకర్ బర్గ్ దూరం
X
దేశానికి రాజైనా పిల్లలకు మాత్రం తండ్రే. తండ్రి అవుతున్నామన్న ఆనందం అనుభవిస్తేనే కాని తెలియదంటారు.
సిలికాన్‌ వ్యాలీలో అత్యంత శక్తివంతమైన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ కూడా ఆ ఆనంద క్షణాలను అనుభవించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే తనకు, ప్రిసిల్లాకు త్వరలోనే ఆడబిడ్డ పుట్టబోతోందని.. కూడా ఫేస్ బుక్ లో జుకర్ ప్రకటించాడు.
ఇందుకోసం ఎంతో బిజీగా ఉండే జుకర్ బర్గ్ ఏకంగా రెండు నెలల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించాడు. ఇప్పటికే పుట్టబోయే బిడ్డకోసం ప్రిసిల్లాతో కలిసి అవసరమైన వస్తువులను సేకరించే పనిలో ఉన్నట్టు జుకర్ చెప్పాడు. తన ఇంట్లో బిడ్డకోసం తెచ్చిన బేబీ స్ట్రోలర్, ఓ బుజ్జి కుక్కపిల్ల ఫొటోని కూడా జుకర్ పోస్టు చేశాడు.
ఇదే సమయంలో ఫేస్ బుక్ ఉద్యోగులకు కూడా నాలుగు నెలల పాటూ వేతనంతో కూడిన మెటర్నిటీ (తల్లికిచ్చే సెలవులు), పెటర్నిటీ ( తండ్రికిచ్చేవి) సెలవులు ఇస్తోంది. అయితే వాటిని చాలా మంది వాడుకోవడం లేదని సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే జుకర్ లీవ్ లో ఉన్నపుడు ఫేస్ బుక్ వ్యవహారాలు ఎవరు చూస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే జుకర్ పెటర్నటీ లీవ్ అసాధారణ నిర్ణయం అంటున్నారు కొంతమంది టెక్నికల్ సంస్థలకు చెందిన వ్యక్తులు. టెక్ సంస్థల హై లెవల్ అధికారులు ఇంత లాంగ్ లీవ్ ఎపుడూ తీసుకోలేదంటున్నారు. యాహూ మహిళా సీఈవో మారిస్సా మేయర్ కూడా కేవలం 2వారాలు మాత్రమే మెటర్నటీ లీవు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు.
First Published:  22 Nov 2015 1:05 AM GMT
Next Story