Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లిలో మ‌హేశ్‌బాబు

రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి-2 సినిమాపై జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా ఇంతా కాదు. మొద‌టి భాగం భారీ హిట్ కావ‌డంతో రెండో భాగంపై అంచ‌నాలు ఆకాశానికంటాయి. తాను వండే వంట‌కంలో ఎలాంటి దినుసులు వేస్తే రుచి పెరుగుతుందో జ‌క్క‌న్న తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. సినిమా ప్ర‌చారం అనే ఘుమ‌ఘుమ‌ల వాస‌న‌ల‌తో బాహుబ‌లి అనే వంట‌కంపై ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌కు మ‌క్కువ పెరిగేలా చేసి వ‌సూళ్ల‌ను ఎలా కొల్ల‌గొట్టాడో మ‌నంద‌రం రుచి చూశాం! త‌న‌కు అంత‌టి పేరు తెచ్చిన తెలుగింటి […]

బాహుబ‌లిలో మ‌హేశ్‌బాబు
X
రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి-2 సినిమాపై జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా ఇంతా కాదు. మొద‌టి భాగం భారీ హిట్ కావ‌డంతో రెండో భాగంపై అంచ‌నాలు ఆకాశానికంటాయి. తాను వండే వంట‌కంలో ఎలాంటి దినుసులు వేస్తే రుచి పెరుగుతుందో జ‌క్క‌న్న తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. సినిమా ప్ర‌చారం అనే ఘుమ‌ఘుమ‌ల వాస‌న‌ల‌తో బాహుబ‌లి అనే వంట‌కంపై ప్ర‌పంచ ప్రేక్ష‌కుల‌కు మ‌క్కువ పెరిగేలా చేసి వ‌సూళ్ల‌ను ఎలా కొల్ల‌గొట్టాడో మ‌నంద‌రం రుచి చూశాం! త‌న‌కు అంత‌టి పేరు తెచ్చిన తెలుగింటి వంట‌కం.. బాహుబ‌లి సినిమాను రెండో భాగంతో ముగించినా ఆ సీరిస్ కొన‌సాగుతుంద‌ని ఇటీవ‌ల స్ప‌ష్టం చేశాడు జ‌క్క‌న్న‌. పైగా వ‌చ్చే ఏడాది మ‌హేశ్‌తో సినిమా చేస్తాన‌ని ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వేదిక‌పై ప్ర‌క‌టించాడు జ‌క్క‌న్న‌. రాజ‌మౌళి మ‌హేశ్‌తో సినిమా చేస్తాడ‌న్న విష‌యం తాజాగా క‌న‌ఫ‌ర్మ్ అయింది. అయితే మ‌హేశ్‌తో త‌న కొత్త ప్రాజెక్టు గ‌రుడ సినిమాను తెర‌కెక్కిస్తాడా? లేదా బాహుబ‌లి సీరిస్‌లో మ‌హేశ్ ను మ‌రో హీరోగా చూపిస్తాడా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది.
నిర్మాత కూడా దొరికాడు!
మ‌హేశ్‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న సినిమాకు అప్పుడే నిర్మాత కూడా దొరికిన‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కించే సినిమాలో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కే ఎల్ నారాయ‌ణ నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటార‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌. రాజమౌళికి నారాయ‌ణ‌ను ప‌రిచ‌యం చేసిందే మ‌హేశ్ అని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌న్న విష‌యం దాదాఫు ఖాయ‌మైంది. ఆ ప్రాజెక్టు ఏంటి? అన్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌హేశ్‌ను జ‌క్క‌న్న ఎలా చూపిస్తాడు? అన్న‌ చ‌ర్చ అప్పుడే మొద‌లైంది. అది బాహుబ‌లి సీరిస్‌లోనా, గ‌రుడ‌లోనా ఇంకేదైనా కొత్త ప్రాజెక్టా అన్న‌ది తేలాలంటే.. ముందు బాహుబ‌లి-2కి శుభం కార్డు ప‌డాలి. అబ్బా..! మ‌రీ.. అప్ప‌టి దాకా ఆగాల్సిందేనా..! ఈ మ‌ధ్య‌లోనే హైప్ పెంచేందుకు జ‌క్క‌న్న ఏదైనా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతాడా! అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు మ‌హేశ్ అభిమానులు.
First Published:  21 Nov 2015 7:06 PM GMT
Next Story