Telugu Global
Cinema & Entertainment

కాఫీతో సూపర్‌స్టార్‌తో చాన్స్ కొట్టేయ్యాలని బ్యూటీ ప్లాన్?

కాఫీ ప్రియుల ఎక్కడ ఉన్నా.. తమ లాగే కాఫీ తాగే అలవాటు ఉన్నవారిని కలుసుకున్నప్పుడు తెగ సంతోష పడిపోతారు. కాఫీ కబుర్లతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతుంటారు. ఇటీవల ఒక యాడ్ షూటింగ్ కోసం బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని కలుసుకుంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. సూపర్‌స్టార్ తమన్నా ‘బాహుబలి ‘ లో బాగా చేసిందని కితాబుకిచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. తమన్నా నేచురల్‌గానే సంతోషపడిపోయింది. ఇద్దరి మధ్య మాటల్లో ఇద్దరూ కాఫీ ప్రియులని తెలుసుకున్నారు. ఇంకేం… మాటలకు కొదవేముంది? […]

కాఫీతో సూపర్‌స్టార్‌తో చాన్స్ కొట్టేయ్యాలని బ్యూటీ ప్లాన్?
X

కాఫీ ప్రియుల ఎక్కడ ఉన్నా.. తమ లాగే కాఫీ తాగే అలవాటు ఉన్నవారిని కలుసుకున్నప్పుడు తెగ సంతోష పడిపోతారు. కాఫీ కబుర్లతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతుంటారు. ఇటీవల ఒక యాడ్ షూటింగ్ కోసం బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని కలుసుకుంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. సూపర్‌స్టార్ తమన్నా ‘బాహుబలి ‘ లో బాగా చేసిందని కితాబుకిచ్చి పొగడ్తలతో ముంచెత్తాడు. తమన్నా నేచురల్‌గానే సంతోషపడిపోయింది. ఇద్దరి మధ్య మాటల్లో ఇద్దరూ కాఫీ ప్రియులని తెలుసుకున్నారు. ఇంకేం… మాటలకు కొదవేముంది? అలా అలా మాటల్లో.. తనకు షారుఖ్‌తో పనిచేసే చాన్స్ వస్తే చెయ్యాలని ఉందనే కోరిక బయట పెట్టిందట మన మిల్కీ బ్యూటీ. మరి దీనికి బాలివుడ్ బాద్‌షా ఎలా ప్రతిస్పందిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. అయినా మూడు వరుస ఫ్లాపులు వచ్చినా… తమన్నాకి బాలివుడ్ ఆశలు అడుగంట లేదని అర్థం అయిపోయింది కదూ!

First Published:  21 Nov 2015 7:07 PM GMT
Next Story