Telugu Global
Cinema & Entertainment

త‌న ప్రేయ‌సి మాజీ ప్రియుడికి క‌న‌బ‌డ‌కూడ‌ద‌ని...

సినిమాల్లో కంటే మితిమీరిన ట్విస్టులుంటాయి బాలివుడ్ నిజ‌జీవిత ప్రేమ‌క‌థ‌ల్లో.  ప్రేమించుకోవ‌డాలు, విడిపోవడాలు, విడిపోయిన‌వారితో  స్క్రీన్‌మీద ప్రేమ‌ని పండించ‌డాలు అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం. అలాంట‌పుడు ఒక‌ప్ప‌టి ప్రేమికులు ఏదోఒక సంద‌ర్భంలో ఒక‌రికొక‌రు ఎదురుబ‌డితే అక్క‌డ‌ వాతావ‌ర‌ణం కాస్త వేడెక్క‌క మాన‌దు. ఆ మ‌ధ్య‌ దీపికా ప‌దుకొనే అలాంటి ఓ సంద‌ర్భంలో బాగా ఇరుక్కుపోయింది.  ఆమె ప్ర‌స్తుత ప్రియుడు ర‌ణ‌వీర్ సింగ్‌, మాజీ ప్రియుడు ర‌ణబీర్ క‌పూర్‌లు ఇద్ద‌రిలో దీపిక ఎవ‌రితో హాట్‌గా క‌న‌బ‌డుతుంది…అనే ప్ర‌శ్న‌ని  ఎదుర్కొంది. చివ‌రికి ప్ర‌స్తుత ప్రియుడు […]

త‌న ప్రేయ‌సి మాజీ ప్రియుడికి క‌న‌బ‌డ‌కూడ‌ద‌ని...
X

సినిమాల్లో కంటే మితిమీరిన ట్విస్టులుంటాయి బాలివుడ్ నిజ‌జీవిత ప్రేమ‌క‌థ‌ల్లో. ప్రేమించుకోవ‌డాలు, విడిపోవడాలు, విడిపోయిన‌వారితో స్క్రీన్‌మీద ప్రేమ‌ని పండించ‌డాలు అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం. అలాంట‌పుడు ఒక‌ప్ప‌టి ప్రేమికులు ఏదోఒక సంద‌ర్భంలో ఒక‌రికొక‌రు ఎదురుబ‌డితే అక్క‌డ‌ వాతావ‌ర‌ణం కాస్త వేడెక్క‌క మాన‌దు. ఆ మ‌ధ్య‌ దీపికా ప‌దుకొనే అలాంటి ఓ సంద‌ర్భంలో బాగా ఇరుక్కుపోయింది. ఆమె ప్ర‌స్తుత ప్రియుడు ర‌ణ‌వీర్ సింగ్‌, మాజీ ప్రియుడు ర‌ణబీర్ క‌పూర్‌లు ఇద్ద‌రిలో దీపిక ఎవ‌రితో హాట్‌గా క‌న‌బ‌డుతుంది…అనే ప్ర‌శ్న‌ని ఎదుర్కొంది. చివ‌రికి ప్ర‌స్తుత ప్రియుడు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపిక ర‌ణ‌బీర్‌ల కెమిస్ట్రీకంటే త‌మ మ‌ధ్య కెమిస్ట్రీ హాట్‌గా ఉంటుంద‌ని, ఒక్కొక్క జంట మ‌ధ్య క‌నిపించే సాన్నిహిత్యం ఒక్కోలా ఉంటుంద‌ని విడ‌మ‌ర‌చి చెప్పి ఆ క్లిష్ట‌మైన సంద‌ర్భాన్ని గ‌ట్టెక్కించాడు.

అలా ఎదురుబ‌డి మ‌రొక‌సారి ఇర‌కాటంలో ప‌డ‌టం ఎందుక‌నుకున్నాడేమో ర‌ణ‌బీర్ క‌పూర్, త‌న ప్ర‌స్తుత ప్రేయ‌సి క‌త్రినా కైఫ్, మాజీ ప్రేమికుడు స‌ల్మాన్ ఖాన్‌ని ఎవాయిడ్ చేయ‌డానికి త‌న సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికే గైర్హాజ‌ర‌య్యాడు. త‌మాషా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో దీపిక‌తో పాటు పాల్గొంటున్న ర‌ణ‌బీర్ క‌పూర్‌, అదే ప‌నిమీద బిగ్‌బాస్ 9 హౌస్‌లోకి వెళ్లాల్సి వ‌చ్చిన‌పుడు మాత్రం త‌ను వెళ్ల‌కుండా దీపిక‌ని ఒంట‌రిగా పంపించాడు. అక్క‌డ త‌న ప్రియురాలు క‌త్రినా కైఫ్ మాజీ ప్రియుడు, బిగ్‌బాస్ షో హోస్ట్ స‌ల్మాన్ ఖాన్‌కి ఎదురుబ‌డాల్సి వ‌స్తుంద‌నే అలా చేశాడు. దాంతో త‌మాషా ప్ర‌మోష‌న్లో భాగంగా దీపికా ప‌దుకొనే ఒక్క‌రే ఎక్ దిన్ కా బిగ్‌బాస్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి వ‌చ్చింది.

First Published:  22 Nov 2015 11:07 PM GMT
Next Story