Telugu Global
Cinema & Entertainment

మ‌హేశ్ కోసం అడ్జ‌స్ట‌యిన ప‌వ‌న్‌

అవునండీ! మీరు చ‌దువుతోంది నిజ‌మే! ప్రిన్స్ మ‌హేశ్ బాబు కోసం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ్జ‌స్ట‌య్యాడు. ఇంత‌కీ ఎక్క‌డంటారా? ఇంకెక్క‌డ?  థియేట‌ర్ల‌లోనే..! మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం- ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ రెండూ ఏప్రిల్‌లో కేవ‌లం 6 రోజుల తేడాతో విడుద‌ల కానున్నాయ‌న్న వార్త ఇటీవ‌ల తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చకు దారితీసింది. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు వేస‌వి బ‌రిలో పోటీ ప‌డుతున్నారంటే.. అభిమానుల‌కు పండ‌గే. అయితే, ఎటొచ్చీ నిర్మాత‌ల‌కే ఈ వార్త గుండెల‌పై కుంప‌టిలా మారిందట‌. ఇలా పోటీ […]

మ‌హేశ్ కోసం అడ్జ‌స్ట‌యిన ప‌వ‌న్‌
X
అవునండీ! మీరు చ‌దువుతోంది నిజ‌మే! ప్రిన్స్ మ‌హేశ్ బాబు కోసం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ్జ‌స్ట‌య్యాడు. ఇంత‌కీ ఎక్క‌డంటారా? ఇంకెక్క‌డ? థియేట‌ర్ల‌లోనే..! మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం- ప‌వ‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ రెండూ ఏప్రిల్‌లో కేవ‌లం 6 రోజుల తేడాతో విడుద‌ల కానున్నాయ‌న్న వార్త ఇటీవ‌ల తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చకు దారితీసింది. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు వేస‌వి బ‌రిలో పోటీ ప‌డుతున్నారంటే.. అభిమానుల‌కు పండ‌గే. అయితే, ఎటొచ్చీ నిర్మాత‌ల‌కే ఈ వార్త గుండెల‌పై కుంప‌టిలా మారిందట‌. ఇలా పోటీ ప‌డి విడుద‌ల చేస్తే.. మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఎక్కువ‌గా థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఏదో ఒక‌దానికే వెళ‌తారు. దేనికి కాస్త నెగిటివ్ టాక్ వ‌చ్చినా.. ఇంక ప్రొడ్యూస‌ర్ డ‌బ్బులు పోయిన‌ట్టే! ఇంక దీనికితోడు ఆన్‌లైన్ పైర‌సీతో రెండు సినిమాల‌కు దెబ్బే.. రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా.. జ‌నాలు థియేట‌ర్ల‌కు రాక‌పోతే అంతే సంగ‌తుల‌ని నిర్మాత‌లు తీవ్రంగా ఆందోళ‌న చెందారు.
ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్‌!
ఈ ప‌రిస్థితిని అంద‌రికంటే ముందుగానే అంచ‌నా వేశాడు ప‌వ‌న్‌. త‌మ లాంటి అగ్ర‌హీరోలు పోటీ ప‌డితే అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతారు గానీ, తేడా వ‌స్తే.. నిర్మాత‌లు దివాళా తీస్తారు. అందుకే త‌న సినిమా స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్ సింగ్‌ను మార్చి ఆఖ‌రునాటికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌కు చెప్పాడంట. మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా విడుద‌ల‌కు త‌న సినిమా రిలీజ్‌కు మ‌ధ్య‌ దాదాపు నాలుగువారాలు గ్యాప్‌ ఉండేలా చూడాల‌ని నిర్మాత‌కు సూచించాడ‌ట‌. దీనికి బ‌య్య‌ర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఓకే చెప్ప‌డంతో ఈ రెండు సినిమాల నిర్మాత‌లు ఊపిరి పీల్చుకున్నారంట‌. విష‌యం తెలుసుకున్న మ‌హేశ్ కూడా ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన‌ట్లు తెలిసింది. పోటీప‌డితే వ‌చ్చేదేం ఉండ‌దు నిర్మాత బావుండాలి అని మ‌న హీరోలు పెద్ద మ‌న‌సు చేసుకుని ఇలా ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకుంటే ఇండ‌స్ర్టీ ప‌ది కాలాల‌పాటు వ‌ర్ధిల్లుతుంద‌ని సినీజ‌నాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  22 Nov 2015 7:02 PM GMT
Next Story