Telugu Global
Cinema & Entertainment

తెలుగు ఇండ‌స్ట్రీ న‌ష్టం రూ.300 కోట్లు పైమాటే..!

ఒక హిట్ ప‌డితే.. వెంట‌నే దాన్ని మించి 4-5 ఫ్లాపులు ప‌డుతున్నాయి. ఇదండీ తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్థం అంటే జూన్ త‌రువాత ఈ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారిపోయింది. బాహుబ‌లి శుభారంభాన్ని ఇచ్చింది. త‌రువాత వ‌చ్చిన శ్రీమంతుడు బాగానే వ‌సూలు చేసుకుని వెళ్లింది. ఇక ఎటొచ్చి త‌రువాత వ‌చ్చిన సినిమాల‌ ప‌రిస్థితి ఇండ‌స్ర్టీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ ఏడాది తెలుగు సినిమాకు వ‌చ్చిన న‌ష్టం ఎంతో తెలుసా? ఏకంగా రూ.300 కోట్ల‌పై మాటేనంట‌. […]

తెలుగు ఇండ‌స్ట్రీ న‌ష్టం రూ.300 కోట్లు పైమాటే..!
X
ఒక హిట్ ప‌డితే.. వెంట‌నే దాన్ని మించి 4-5 ఫ్లాపులు ప‌డుతున్నాయి. ఇదండీ తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్థం అంటే జూన్ త‌రువాత ఈ ప‌రిస్థితి మ‌రీ దిగ‌జారిపోయింది. బాహుబ‌లి శుభారంభాన్ని ఇచ్చింది. త‌రువాత వ‌చ్చిన శ్రీమంతుడు బాగానే వ‌సూలు చేసుకుని వెళ్లింది. ఇక ఎటొచ్చి త‌రువాత వ‌చ్చిన సినిమాల‌ ప‌రిస్థితి ఇండ‌స్ర్టీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ ఏడాది తెలుగు సినిమాకు వ‌చ్చిన న‌ష్టం ఎంతో తెలుసా? ఏకంగా రూ.300 కోట్ల‌పై మాటేనంట‌. ఇందులో ఎక్కువ శాతం ప్లాపులు జూన్ త‌రువాత వ‌చ్చిన‌వే ఉన్నాయి. ఇండ‌స్ర్టీకి ఈ ఏడాది ఆరంభంలో గోపాల గోపాల‌, ప‌టాస్‌, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, టెంప‌ర్ త‌దిత‌ర సినిమాలు మంచి శుభారంభాన్నే ఇచ్చాయి. కానీ ఎటొచ్చి ఈ శుభారంభాన్ని మిగిలిన సినిమాలు అందుకోలేక దారుణంగా న‌ష్టాల్ని చ‌వి చూశాయి.
పెద్దవే ముంచాయి…!
ఈ ఏడాది బాగా వ‌సూలు చేసుకున్న సినిమాల్లో బాహుబ‌లి, శ్రీ‌మంతుడు అగ్ర‌స్థానాన నిలిచాయి. గోపాల‌- గోపాల‌, టెంప‌ర్, జిల్‌, కంచె సినిమాలు వ‌సూళ్ల‌లో త‌మ మార్కును చూపాయి. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ల‌య‌న్‌, కిక్‌-2, పండ‌గ‌చేస్కో, శివ‌మ్, బ్రూస్‌లీ, షేర్‌, అఖిల్ సినిమాలు దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఫ‌ర్వాలేద‌నిపించినా.. ఆశించిన మేర‌కు ఆడ‌లేద‌ని టాక్‌. ఇక రుద్ర‌మ దేవి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, విడుద‌ల‌లో ప్లానింగ్‌లోపం సినిమాకు శాపంగా మారింది. ఈ సినిమా విడుద‌లైన వెంట‌నే బ్రూస్‌లీ విడుద‌ల‌కావ‌డంతో రుద్ర‌మ‌దేవిపై భారీగా దెబ్బ‌ప‌డింది. ఈ ఒక్క‌ సినిమానే దాదాపు రూ.20 కోట్లు న‌ష్టాన్ని చ‌విచూసింద‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. హిట్ టాక్ తెచ్చుకుని ఈ స్థాయి న‌ష్టం చ‌వి చూసిన ఏకైక తెలుగు సినిమా ఇదేనేమో! ఈ సినిమాల ప‌రాజ‌యం విలువ అంతా లెక్కేస్తే.. దాదాపు రూ.300 కోట్లు దాటింద‌ని అంచ‌నా. దీనికి పైర‌సీ కూడా తోడైంది.
చిన్న సినిమాలే బెట‌ర్‌!
ఈ ఏడాది చిన్న సినిమాలు మ‌ళ్లీ త‌మ దెబ్బ రుచి చూపించాయి. కొన్ని అడ్ర‌స్‌లు గల్లంతైనా మ‌రి కొన్ని రెండింత‌ల వ‌సూళ్లు సాధించాయి. జ్యోతిల‌క్ష్మి, అసుర‌, దోచెయ్‌, దొంగాట‌, డైన‌మైట్‌, సింగం 123, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, రాజుగారి గ‌ది, త్రిపుర‌, కుమారి 21- ఎఫ్ మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించి చిన్న సినిమా ప్ర‌తాపాన్ని చూపాయి.
First Published:  23 Nov 2015 12:06 AM GMT
Next Story