Telugu Global
Cinema & Entertainment

కోటి ఇచ్చినా.. నో  స్కిన్ షో

అవికా గోర్‌.. తెలుగు తెర‌పై  ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కుర్ర హీరోయిన్‌. ఇంత‌వ‌ర‌కు సంప్ర‌దాయ పాత్ర‌ల్లోనే క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ ఇక‌పైనా అలాంటి పాత్ర‌లే వేస్తాన‌ని భీష్మించుకు కూర్చుంద‌ట‌. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవాల‌న్న నిర్మాత‌ల‌కు నో.. అలాంటివి నాకు న‌చ్చ‌వు.. అంటూ తెగేసి చెప్తోంది. కోటిరూపాయ‌లిచ్చినా.. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసినా.. ఎక్స్‌పోజింగ్, స్కిన్ షోకు ఒప్పుకునేది లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతోంది. ఎంత క‌థ‌లో భాగంగా అలాంటి స‌న్నివేశాలు వ‌చ్చినా చేయ‌నంటే చేయ‌న‌ని క‌రాఖండిగా చెప్పేస్తోంద‌ట‌. అదేంటి..! అప్ […]

కోటి ఇచ్చినా.. నో  స్కిన్ షో
X
అవికా గోర్‌.. తెలుగు తెర‌పై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కుర్ర హీరోయిన్‌. ఇంత‌వ‌ర‌కు సంప్ర‌దాయ పాత్ర‌ల్లోనే క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ ఇక‌పైనా అలాంటి పాత్ర‌లే వేస్తాన‌ని భీష్మించుకు కూర్చుంద‌ట‌. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవాల‌న్న నిర్మాత‌ల‌కు నో.. అలాంటివి నాకు న‌చ్చ‌వు.. అంటూ తెగేసి చెప్తోంది. కోటిరూపాయ‌లిచ్చినా.. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసినా.. ఎక్స్‌పోజింగ్, స్కిన్ షోకు ఒప్పుకునేది లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతోంది. ఎంత క‌థ‌లో భాగంగా అలాంటి స‌న్నివేశాలు వ‌చ్చినా చేయ‌నంటే చేయ‌న‌ని క‌రాఖండిగా చెప్పేస్తోంద‌ట‌. అదేంటి..! అప్ క‌మింగ్ హీరోయిన్ ఇలాంటి కండిష‌న్లు పెట్ట‌డ‌మేంటి? విడ్డూరం కాక‌పోతే..! అని కొంద‌రు నిర్మాత‌లు విసుక్కుంటున్నా అమ్మ‌డు ప‌ట్టించుకోవ‌డం లేదంట‌.
కార‌ణం ఏంటి?
సినిమాలు చేయ‌డ‌మైనా మానేస్తా గానీ, స్కిన్ షోకు తాను వ్య‌తిరేక‌మ‌ని చెప్తున్న అవికా గోర్ అలా ఎందుకు అందో..తెలుసా? చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ ద్వారా ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్ త‌దిత‌ర ఆసియా, మ‌ధ్య‌ప్రాచ్య దేశాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అవికాగోర్‌. ఆ దేశాల్లో ఈ చిన్నారి పెళ్లి కూతురు పాత్ర అంద‌రికీ సుప‌రిచిత‌మే! తాను న‌టించిన సినిమాల‌ను ఆయా దేశాల్లోని త‌న అభిమానులు చూస్తునే ఉన్నారంటే అందుకు కార‌ణం చిన్నారి పెళ్లి కూతురి పాత్రేన‌ని చెబుతోంది. వారు ఇప్ప‌టికీ త‌న‌ను వాళ్ల కూతురు, సోద‌రిలానే భావించి చూస్తున్నారని.. సో.. ఇలాంటి స్కిన్ షో చేసి వారి మ‌నుసుల్ని గాయ‌ప‌ర‌చ‌లేని వాపోతుంద‌ట‌. అందుకే, ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇచ్చినా స‌రే.. అలాంటి పాత్ర‌లు త‌న వ‌ద్ద‌కు తీసుకురావ‌ద్ద‌ని క‌థ విన‌క‌ముందే కండిష‌న్ పెడుతోంద‌ట‌ ఈ చిన్న‌ది.
First Published:  23 Nov 2015 7:05 PM GMT
Next Story