Telugu Global
Cinema & Entertainment

వ‌ర్మ హీరో న్యూడ్ సీన్‌

హీరోల‌కు వైవిధ్య పాత్ర‌లు, హీరోయిన్ల‌కు రొమాంటిక్ పాత్ర‌లు ఇచ్చి సంచ‌నాల‌ను సృష్టించడం వ‌ర్మ‌కు కెమెరాతో పెట్టిన విద్య‌. స‌ద‌రు సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం ఆయ‌న‌కు ట్వీట్‌తో అబ్బిన బుద్ధి. తాజాగా కుర్ర‌హీరో రాజ్ త‌రుణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ప‌నిలో ప‌నిగా త‌న హీరోకు  ట్వీట్ల ద్వారా కావాల్సినంత ప్ర‌చారం క‌ల్పించి పెట్టాడు. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా… పూర్తిగా న‌గ్నంగా న‌టించే స‌న్నివేశం ఒక‌టి ఉందని అప్పుడే […]

వ‌ర్మ హీరో న్యూడ్ సీన్‌
X
హీరోల‌కు వైవిధ్య పాత్ర‌లు, హీరోయిన్ల‌కు రొమాంటిక్ పాత్ర‌లు ఇచ్చి సంచ‌నాల‌ను సృష్టించడం వ‌ర్మ‌కు కెమెరాతో పెట్టిన విద్య‌. స‌ద‌రు సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం ఆయ‌న‌కు ట్వీట్‌తో అబ్బిన బుద్ధి. తాజాగా కుర్ర‌హీరో రాజ్ త‌రుణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ప‌నిలో ప‌నిగా త‌న హీరోకు ట్వీట్ల ద్వారా కావాల్సినంత ప్ర‌చారం క‌ల్పించి పెట్టాడు. ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా… పూర్తిగా న‌గ్నంగా న‌టించే స‌న్నివేశం ఒక‌టి ఉందని అప్పుడే ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది. ఇంత కుర్ర‌హీరో ఇలాంటి స‌న్నివేశానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అన్న చ‌ర్చ కూడా మొద‌లైంది. ఆర్జీవి పెద్ద ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి, కుర్రాడు క‌థ విన‌కుండానే క‌మిట్ అయ్యాడా? లేదంటే.. ఆ స‌న్నివేశం కీల‌కమ‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాడా? అన్న విష‌యం సినిమా విడుద‌లైతే గానీ చెప్ప‌లేమంటున్నారు సినీ విమ‌ర్శ‌కులు.
సంచ‌ల‌నం కోసమా..!
ఇండియ‌న్‌ సెల్యూలాయిడ్‌పై హీరోలు న‌గ్నంగా క‌నిపించ‌డం చాలా అరుదు. త‌మిళ‌, హిందీ, ఇత‌ర భాష‌ల్లో ఇలాంటివి సాధార‌ణ‌మే కానీ తెలుగులో దాదాపుగా లేవ‌నే చెప్పాలి. కానీ, ఇటీవ‌ల క‌లెక్ష‌న్ల సునామీతో దేశంలోనే నెం.1గా నిలిచిన పీకే చిత్రంలో ఆమీర్ ఖాన్ ఒంటిపై ఎలాంటి ద‌స్తులు లేకుండా క‌నిపించ‌డం సినిమా ప్ర‌చారానికి బాగానే దోహ‌ద‌ప‌డింది. సినిమాలో క‌థ‌కు ఆ స‌న్నివేశం అవ‌స‌రం ఏంటో తెర‌పై చూసిన ప్రేక్ష‌కులు స‌మాధాన‌ప‌డ్డారు. మ‌రి రాజ్ త‌రుణ్ న‌గ్న రూపం సినిమా ప్ర‌చారం కోసమా? క‌థ‌లో భాగ‌మా ? అన్న‌ది తెలియాలంటే.. మ‌రి కొద్ది రోజులు ఆగాల్సిందే!
First Published:  23 Nov 2015 7:06 PM GMT
Next Story