Telugu Global
Others

మేనేజర్‌ను మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి నిజంగానే కొట్టారా?

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై రేణిగుంట విమానాశ్రయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్‌లు చూపించాల్సిందిగా కోరినందుకు తమను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. తొలుత ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్న ఎంపీ మిథున్‌ రెడ్డిని అక్కడే ఉన్న ఎయిర్‌ పోర్టు మేనేజర్ ఆపారని సమాచారం. Click to Read: రేవంత్‌కు సీఎం అభ్యర్థిగా ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి పాస్‌లు చూపితేనే లోనికి అనుమతిస్తామన్నట్టు తెలుస్తోంది. తాను ఎంపీనని చెప్పినా అధికారి మాత్రం తగ్గలేదని చెబుతున్నారు. ఈ […]

మేనేజర్‌ను మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి నిజంగానే కొట్టారా?
X

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై రేణిగుంట విమానాశ్రయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్‌లు చూపించాల్సిందిగా కోరినందుకు తమను కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. తొలుత ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్న ఎంపీ మిథున్‌ రెడ్డిని అక్కడే ఉన్న ఎయిర్‌ పోర్టు మేనేజర్ ఆపారని సమాచారం.

Click to Read: రేవంత్‌కు సీఎం అభ్యర్థిగా ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి

పాస్‌లు చూపితేనే లోనికి అనుమతిస్తామన్నట్టు తెలుస్తోంది. తాను ఎంపీనని చెప్పినా అధికారి మాత్రం తగ్గలేదని చెబుతున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సయమంలోనే మేనేజర్‌పై చెవిరెడ్డి తదితరులు చేయి చేసుకున్నారని ఆరోపణ. ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో పోలీసులున్నారు.

First Published:  26 Nov 2015 10:54 AM GMT
Next Story