Telugu Global
Cinema & Entertainment

రాజ్ త‌రుణ్ రేటు ఎంతో తెలుసా..?

వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో రాజ్ త‌రుణ్ త‌న రేటు అమాంతం పెంచేశాడ‌ని తెలిసింది. తొలిసినిమా ఉయ్యాల జంపాలతోనే చ‌క్క‌టి అభిన‌యాన్ని క‌న‌బ‌రిచిన ఈ కుర్ర‌హీరో త‌రువాత వ‌చ్చిన సినిమా చూపిస్త మావాతోనూ మెప్పించాడు. తాజాగా విడుద‌లైన కుమారి 21ఎఫ్ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం మ‌నోడికి క‌లిసి వ‌చ్చింది. కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన అరుదైన హీరోల్లో ఒక‌డిగా త‌న పేరునూ నిలుపుకున్నాడు రాజ్ త‌రుణ్‌! ఇప్ప‌టికే వంశీ, రామ్‌గోపాల్ వ‌ర్మ వంటి పెద్ద‌హీరోల‌తో సినిమాల‌కు క‌మిట్ […]

రాజ్ త‌రుణ్ రేటు ఎంతో తెలుసా..?
X
వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో రాజ్ త‌రుణ్ త‌న రేటు అమాంతం పెంచేశాడ‌ని తెలిసింది. తొలిసినిమా ఉయ్యాల జంపాలతోనే చ‌క్క‌టి అభిన‌యాన్ని క‌న‌బ‌రిచిన ఈ కుర్ర‌హీరో త‌రువాత వ‌చ్చిన సినిమా చూపిస్త మావాతోనూ మెప్పించాడు. తాజాగా విడుద‌లైన కుమారి 21ఎఫ్ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం మ‌నోడికి క‌లిసి వ‌చ్చింది. కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన అరుదైన హీరోల్లో ఒక‌డిగా త‌న పేరునూ నిలుపుకున్నాడు రాజ్ త‌రుణ్‌! ఇప్ప‌టికే వంశీ, రామ్‌గోపాల్ వ‌ర్మ వంటి పెద్ద‌హీరోల‌తో సినిమాల‌కు క‌మిట్ అయిన రాజ్‌కు అవ‌కాశాలు వ‌రుస‌గా త‌లుపు ప‌డుతున్నాయి.
నిర్మాత‌లు సిద్ధం!
దీంతో దీపం ఉన్న‌పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశాడంట రాజ్ త‌రుణ్‌. త‌న రేటును రూ.75 ల‌క్ష‌ల‌ నుంచి కోటి వ‌ర‌కు పెంచేశాడంట‌. ఈ కుర్ర‌హీరోకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. హ్యాట్రిక్ సాధించాడంటే కుర్రాడిలో త‌ప్ప‌కుండా విష‌యం ఉంద‌ని నిర్మాత‌లు సైతం అంగీక‌రిస్తున్నారు. రూ.కోటి అయినా స‌రేనంటూ ముందుకు వస్తోండ‌టం విశేషం. రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాలో న్యూడ్ సీన్‌లో న‌టిస్తుండ‌టం ఈ కుర్రాడి డేరింగ్‌కు నిద‌ర్శ‌నమ‌ని చెప్పుకుంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు. రూ.కోటి ఇస్తున్నార‌ని వ‌చ్చిన ప్ర‌తి ప్రాజెక్టుకు ఓకే చెప్ప‌డం లేదు. సెలెక్టివ్‌గా, యూత్‌కు ద‌గ్గ‌ర‌య్యే క‌థ‌ల‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు స‌మాచారం.
First Published:  25 Nov 2015 7:04 PM GMT
Next Story