Telugu Global
Others

మతాన్ని విమర్శిస్తే ఉరి

అశ్రాఫ్ ఫయాద్ పలస్తీనా కవి. ఆయన సౌదీ అరేబియాలో శైశవావస్థలో ఉన్న సమకాలీన కళలను ప్రోత్సహించడం, పరిరక్షించడమే పనిగా పెట్టుకున్నారు. జెడ్డాలోనూ వెనిస్ లోని వెనిస్ బియెన్నేల్ కళా సంస్థలోనూ సమకాలీన కళాప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 35 ఏళ్ల ఫయాద్ బ్రిటిశ్-సౌదీ కళా సంస్థకు చెందిన వారు. ఆయన ఇస్లాం మతాన్ని నిరసించారన్న ఆరోపణ ఉంది. సౌదీ సమాజానికి తగిన భావాలు ఫయాద్ కు లేవు అన్న అభియోగాలూ ఉన్నాయి. ఇవన్నీ సౌదీ “సమాజం” దృష్టిలో ఇస్లాం […]

మతాన్ని విమర్శిస్తే ఉరి
X

అశ్రాఫ్ ఫయాద్ పలస్తీనా కవి. ఆయన సౌదీ అరేబియాలో శైశవావస్థలో ఉన్న సమకాలీన కళలను ప్రోత్సహించడం, పరిరక్షించడమే పనిగా పెట్టుకున్నారు. జెడ్డాలోనూ వెనిస్ లోని వెనిస్ బియెన్నేల్ కళా సంస్థలోనూ సమకాలీన కళాప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

35 ఏళ్ల ఫయాద్ బ్రిటిశ్-సౌదీ కళా సంస్థకు చెందిన వారు. ఆయన ఇస్లాం మతాన్ని నిరసించారన్న ఆరోపణ ఉంది. సౌదీ సమాజానికి తగిన భావాలు ఫయాద్ కు లేవు అన్న అభియోగాలూ ఉన్నాయి. ఇవన్నీ సౌదీ “సమాజం” దృష్టిలో ఇస్లాం మతాన్ని నిరాకరించడంతో సమానం. ఆయనను ఇది వరకు ఒక సారి అరెస్టు చేసి జామీను మీద విడుదల చేశారు. మళ్లీ వెంటనే అరెస్టు చేశారు. ఆయనపై విచారణ జరిపి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 800 కొరడా దెబ్బల శిక్ష కూడా విధించాలని 2014లో తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై ఆయన అప్పీలును న్యాయస్థానం గత నెల తోసిపుచ్చింది. న్యాయ మూర్తులు ఆయనకు మరణ దండన విధించడానికి అడ్డంకులేమీ లేవని నిర్ధారించారు. ఆయన దాదాపు రెండేళ్ల నుంచి జైలులోనే ఉన్నారు. పలస్తీనా కవి అయిన ఫయాద్ ను జైలుకెళ్లి చూడడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆయనకు న్యాయపోరాటం చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు.

fayadhమరణ దండన విధించదగినంత తప్పు తానేమీ చేయలేదని, సొంత భావాలు ఉండడం తప్పు కాదని ఫయాద్ చేసిన వాదనలు అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి. తాను నాస్తికుడిని కానని ఫయాద్ చెప్పినా వినిపించుకున్న వారే లేరు. తనకు విధించిన నాలుగేళ్ల శిక్షపై సవాలు చేస్తూ ఆయన పిటిషన్ పెట్టుకుంటే ఆ పిటిషన్ ను తోసిపుచ్చి కేసు విచారణను మళ్లీ కింది కోర్టుకు పంపించారు. కింది కోర్టు న్యాయమూర్తులు ఇస్లామిక్ న్యాయసూత్రాలకు చెప్పిన భాష్యం ప్రకారం శిక్ష తప్పక పోగా మరణ దండన విధించారు. ఆయనకు సత్వర న్యాయం జరగొచ్చు. అదే త్వరలోనే మరణ శిక్ష అమలు చేయవచ్చు.

-భరణి

First Published:  26 Nov 2015 6:03 PM GMT
Next Story