Telugu Global
Others

వజ్రాలు పొదిగిన కోట్ల విలువైన శివలింగం స్వాధీనం

అత్యంత విలువైన పంచలోహ శివలింగాన్ని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 87 వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు ఐదు తలల నాగపడకతో ఉన్న విగ్రహం ఇది. నరసింహ, దుర్గప్రసాద్, శివనాగేంద్ర, వెంకన్నబాబు, శ్రీను అనే వ్యక్తులు టీంగా తయారై విగ్రహాన్ని విక్రయించబోయారు. వీరంతా కృష్ణలంకలో జ్యుయలరీ బార్ ఆర్ట్స్ పేరిట వ్యాపారం చేస్తుంటారు. పురాతన విగ్రహాలు విక్రయించడం వీని పని. వాట్సాప్‌ ద్వారా డబ్బున్న వారికి ఈ శివలింగం ఫోటోను పంపించారు. రూ. 8 కోట్ల […]

వజ్రాలు పొదిగిన కోట్ల విలువైన శివలింగం స్వాధీనం
X

అత్యంత విలువైన పంచలోహ శివలింగాన్ని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 87 వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు ఐదు తలల నాగపడకతో ఉన్న విగ్రహం ఇది. నరసింహ, దుర్గప్రసాద్, శివనాగేంద్ర, వెంకన్నబాబు, శ్రీను అనే వ్యక్తులు టీంగా తయారై విగ్రహాన్ని విక్రయించబోయారు. వీరంతా కృష్ణలంకలో జ్యుయలరీ బార్ ఆర్ట్స్ పేరిట వ్యాపారం చేస్తుంటారు. పురాతన విగ్రహాలు విక్రయించడం వీని పని. వాట్సాప్‌ ద్వారా డబ్బున్న వారికి ఈ శివలింగం ఫోటోను పంపించారు.

siva-lingam--ness

రూ. 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖరీదు చేస్తుందంటూ ప్రచారం చేశారు. చివరకు విజయవాడలోని ఓ వ్యక్తికి రూ. కోటిన్నరకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. విగ్రహాన్ని అమ్మేందుకు తీసుకొస్తున్న విషయం తెలుసుకున్న విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, ఎస్‌ఐ సురేష్‌ రెడ్డి మాటు వేసి పట్టుకున్నారు. శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. పురాతనమైనది కావడంతో దీనికి విలువ కట్టడం సాధ్యం కాదంటున్నారు.

First Published:  27 Nov 2015 4:33 AM GMT
Next Story