Telugu Global
Others

వైఫైకి 100రెట్ల వేగంతో లై ఫై  

ఇప్పుడంతా టెక్నాలజీ మయం. ఐదేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ అంటే నగరాలకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. ఇంటర్నెట్ స్పీడ్ లోనూ ఎంతో మార్పులు వచ్చాయి. మామూలు నెట్ కంటే మరింత వేగంగా వై ఫై అందుబాటులోకి వచ్చింది. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్‌తో పనిచేసే లైఫై.. వైఫై కన్నా వంద రెట్ల స్పీడ్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశారు.  ఈకొత్త వైర్‌లెస్ నెట్ సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో సమాచారాన్ని […]

వైఫైకి 100రెట్ల వేగంతో లై ఫై  
X
ఇప్పుడంతా టెక్నాలజీ మయం. ఐదేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ అంటే నగరాలకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. ఇంటర్నెట్ స్పీడ్ లోనూ ఎంతో మార్పులు వచ్చాయి. మామూలు నెట్ కంటే మరింత వేగంగా వై ఫై అందుబాటులోకి వచ్చింది. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్‌తో పనిచేసే లైఫై.. వైఫై కన్నా వంద రెట్ల స్పీడ్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశారు.
ఈకొత్త వైర్‌లెస్ నెట్ సెకనుకు 1.5 గిగా బైట్ల వేగంతో సమాచారాన్ని అందిస్తుందట. 2011లో స్కాట్‌లాండ్ ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన హెరాల్డ్ హాస్ లై ఫైని రూపొందించారు. ఎల్ ఈడీ లైట్ నుంచి వచ్చే లైటింగ్‌తో ఇది పనిచేస్తుందని హాస్ నిరూపించాడు. కాబట్టే దీనికి లై ఫై అన్న పేరు పెట్టారు. ఈ లైఫై స్పీడ్ తో ఆల్బమ్స్, హెచ్ డీ సినిమాలు, వీడియో గేమ్స్ అన్నీ సెకన్లలో డౌన్ లోడ్ చేయవచ్చట.
ఈ లైఫై వైర్‌లెస్ యాక్సిస్ కోసం ఓ ప్లగ్‌ను, అప్లికేషన్‌ను హాస్ టీమ్ రెడీ చేశారు. ఒలెడ్.కాం అనే ఫ్రెంచ్‌ సంస్థ దీన్ని ఉపయోగించడం తోపాటు పలు ఆస్పత్రుల్లో కూడా ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో లైఫై టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మూడేళ్లలో ఇది వినియోగదారులకు పూర్తిస్థాయిలో లై ఫై అందుబాటులోకి రావచ్చని అంచనా.
First Published:  27 Nov 2015 5:53 AM GMT
Next Story