Telugu Global
Cinema & Entertainment

సైజ్ జీరోకి రాజ‌మౌళి ఏం చేశాడు?

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం సైజ్ జోరో. అనుష్క 93 కిలోలన్న లావు అమ్మాయిగా బ‌రువు పెరిగి మ‌రీ వేసిన చాలెంజింగ్ రోల్ ఇది! ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లై మంచి టాకే తెచ్చుకుంది. సినిమా కోసం నిజంగా బ‌రువు పెరిగిన అనుష్క కోస‌మైనా ఓ సారి చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఈ సినిమాకు జ‌క్క‌న్న రాజ‌మౌళి సాయం చేశాడంట‌. అదేంటి? ఆయ‌న బాహుబ‌లి-2 చిత్రీక‌ర‌ణలో త‌ల‌మున‌క‌ల‌య్యారు క‌దా! ఆయ‌న‌ ఏం […]

సైజ్ జీరోకి రాజ‌మౌళి ఏం చేశాడు?
X
ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం సైజ్ జోరో. అనుష్క 93 కిలోలన్న లావు అమ్మాయిగా బ‌రువు పెరిగి మ‌రీ వేసిన చాలెంజింగ్ రోల్ ఇది! ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లై మంచి టాకే తెచ్చుకుంది. సినిమా కోసం నిజంగా బ‌రువు పెరిగిన అనుష్క కోస‌మైనా ఓ సారి చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ఈ సినిమాకు జ‌క్క‌న్న రాజ‌మౌళి సాయం చేశాడంట‌. అదేంటి? ఆయ‌న బాహుబ‌లి-2 చిత్రీక‌ర‌ణలో త‌ల‌మున‌క‌ల‌య్యారు క‌దా! ఆయ‌న‌ ఏం సాయం చేశాడు? ఎలాంటి సాయం చేశాడు? అనే క‌దా మీ అనుమానం.. అక్క‌డికే వ‌స్తున్నాం.!
ప్ర‌కాశే వెళ్లి క‌లిశాడు!
సినిమా మొత్తం పూర్త‌య్యాక ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ వెళ్లి రాజ‌మౌళిని క‌లిశాడంట‌. త‌న సినిమాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అని అడిగి ప్రివ్యూ చూపించాడ‌ట‌. ఎంతైనా త‌న గురువు రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు కాబ‌ట్టి జ‌క్క‌న కూడా సానుకూలంగా స్పందించాడు. సినిమా మొత్తం చూసిన జ‌క్క‌న్న ఎక్క‌డ ఎడిట్ చేయాలో సూచించాడ‌ట. అన‌వ‌స‌రపు స‌న్నివేశాల‌ను తొల‌గించి త‌న‌దైన శైలిలో ఎడిట్ చేయించాడ‌ట‌. సినిమాపై రాజ‌మౌళి చేయిప‌డింది కాబ‌ట్టే, చిత్రం మంచి టాక్ తెచ్చుకుంద‌ని స‌మాచారం.
First Published:  28 Nov 2015 12:01 AM GMT
Next Story