Telugu Global
Cinema & Entertainment

త్రివిక్ర‌మ్ ఇదేం తీర‌ప్పా?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీరుపై ఇప్ప‌డు తెలుగు ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల కొంద‌రు ఇబ్బంది ప‌డుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం నితిన్‌, స‌మంత జంట‌గా అ..ఆ..! అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రాధాక్రిష్ణ‌. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి  షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు షాట్స్ కంటే ఎక్కువ‌గా తీయ‌డం లేద‌ని, లోకేష‌న్‌కి త్రివిక్ర‌మ్ ఏనాడూ టైమ్‌కు రావ‌డం లేద‌ని […]

త్రివిక్ర‌మ్ ఇదేం తీర‌ప్పా?
X
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీరుపై ఇప్ప‌డు తెలుగు ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల కొంద‌రు ఇబ్బంది ప‌డుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం నితిన్‌, స‌మంత జంట‌గా అ..ఆ..! అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రాధాక్రిష్ణ‌. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రోజుకు రెండు లేదా మూడు షాట్స్ కంటే ఎక్కువ‌గా తీయ‌డం లేద‌ని, లోకేష‌న్‌కి త్రివిక్ర‌మ్ ఏనాడూ టైమ్‌కు రావ‌డం లేద‌ని స‌మాచారం. ఆయ‌న వ‌చ్చేస‌రికి అసిస్టెంట్స్ షాట్స్ రెడీ చేసి పెడుతున్నార‌ట‌. త్రివిక్ర‌మ్‌ వ‌చ్చి సీన్ వివ‌రించేంత వ‌ర‌కు హీరో, హీరోయిన్ల‌కు ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదంట‌. తీరా షూటింగ్‌కు ఆల‌స్యంగా చేరుకుంటున్న‌ త్రివిక్ర‌మ్ వ‌చ్చాక ఇది బాలేదు, అది బాలేదు అంటూ విసుక్కుంటున్నాడ‌ట‌. ఆయ‌న మూడ్ బావుంటేనే ఆ రోజు షూటింగ్ వేగంగా న‌డుస్తుంద‌ని, లేకుంటే పేక‌ప్ చెప్పి వెళ్లిపోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
ఆర్ట్ డైరెక్ట‌ర్ అందుకే త‌ప్పుకున్నాడా?
ఈ సినిమాకు తొలుత‌ సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ప‌నిచేశారు. కార‌ణం లేకుండా త్రివిక్ర‌మ్ ఆయ‌న్ను తీసేయించాడ‌ని రూమ‌ర్ న‌డుస్తోంది. ఎందుకు? అన్న విష‌యం రాజీవ‌న్‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం విశేషం. అందుకే త్రివిక్ర‌మ్ తీరుపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. నిర్మాత జోక్యంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గడంతో ఆయన ప్లేస్ లోకి మరో ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వచ్చి చేరారు. ఒక రోజు షూటింగ్ అంటే ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌న్న విష‌యం తెలిసిందే! షూటింగ్ స్లోగా జ‌ర‌గ‌డం వ‌ల్ల నిర్మాణ వ్య‌యం పెరిగిపోతుంద‌ని రాధాక్రిష్ణ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నాడ‌ని తెలిసింది. హీరో నితిన్‌, హీరోయిన్ స‌మంత కూడా త్రివిక్ర‌మ్ తీరుపై అసంతృప్తిగానే ఉన్నార‌ని సమాచారం.
First Published:  28 Nov 2015 9:51 PM GMT
Next Story