Telugu Global
Cinema & Entertainment

చరణ్‌ మూవీలో విలన్‌గా అరవింద్- రికార్డు రెమ్యునరేషన్!

తమిళంలో సూపర్‌ హిట్ అయిన యాక్షన్ ఫిల్మ్ ”తనీ ఒరువన్‌” తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్‌ హీరోగా నటించబోతున్నాడు. జనవరి రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌ రోల్ చేసే అవకాశం ఉంది.. రోజా, బొంబాయి సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి …చరణ్‌ మూవీలో విలన్‌గా చేసేందుకు దాదాపు ఓకే చేసినట్టు తెలుస్తోంది. ”తనీ ఒరువన్‌” తమిళ చిత్రంలో అరవింద్‌స్వామే నటించారు. దీంతో […]

చరణ్‌ మూవీలో విలన్‌గా అరవింద్- రికార్డు రెమ్యునరేషన్!
X

తమిళంలో సూపర్‌ హిట్ అయిన యాక్షన్ ఫిల్మ్ ”తనీ ఒరువన్‌” తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్‌ హీరోగా నటించబోతున్నాడు. జనవరి రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌ రోల్ చేసే అవకాశం ఉంది.. రోజా, బొంబాయి సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి …చరణ్‌ మూవీలో విలన్‌గా చేసేందుకు దాదాపు ఓకే చేసినట్టు తెలుస్తోంది.

”తనీ ఒరువన్‌” తమిళ చిత్రంలో అరవింద్‌స్వామే నటించారు. దీంతో తెలుగులో కూడా ఆయనతోనే చేయించాలని చిత్రయూనిట్ డిసైడ్ అయింది. తొలుత విలన్ పాత్రకు నారా రోహిత్, మాధవన్‌లో ఒకరిని అనుకున్నారు. కానీ ఆ పాత్రకు అరవింద్ స్వామే బాగా సరిపోతారని తుదకు నిర్ణయించుకున్నారు. అన్నట్టు చరణ్‌ మూవీలో విలన్ పాత్ర చేసేందుకు అరవింద్ స్వామి ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

charan-movie

First Published:  1 Dec 2015 10:19 AM GMT
Next Story