Telugu Global
Others

గురజాడకు, కందుకూరికి తేడా తెలియని వైఎస్‌ఆర్‌సీపీ... లోకేష్‌

మహాకవి గురజాడ శతవర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌ టీమ్‌ పెట్టిన పోస్ట్‌లో గురజాడ ఫొటోకు బదులుగా కందుకూరి వీరేశలింగం ఫొటో పెట్టారు. ఈ తప్పును అందిపుచ్చుకున్న లోకేష్‌ తన ట్విట్టర్‌లో ఇదే అదునుగా జగన్‌మీద, పార్టీమీద విరుచుకుపడ్డాడు. వెంటనే తెలుగుతమ్ముళ్ళు సోషల్‌ మీడియాలో జగన్‌ను, వైఎస్‌ఆర్‌సీపీని దుమ్ములేపారు. జరిగిన పొరపాటును గుర్తించిన వైఎస్‌ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌ టీమ్‌ క్షమాపణ కోరుతూ ఫొటో మార్చారు. అయితే లోకేష్‌ ట్వీట్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అఫిషియల్‌ సోషల్‌మీడియా టీమ్‌ స్పందించకపోయినా పార్టీ అభిమానులు వెంటనే […]

గురజాడకు, కందుకూరికి తేడా తెలియని వైఎస్‌ఆర్‌సీపీ... లోకేష్‌
X

మహాకవి గురజాడ శతవర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌ టీమ్‌ పెట్టిన పోస్ట్‌లో గురజాడ ఫొటోకు బదులుగా కందుకూరి వీరేశలింగం ఫొటో పెట్టారు. ఈ తప్పును అందిపుచ్చుకున్న లోకేష్‌ తన ట్విట్టర్‌లో ఇదే అదునుగా జగన్‌మీద, పార్టీమీద విరుచుకుపడ్డాడు. వెంటనే తెలుగుతమ్ముళ్ళు సోషల్‌ మీడియాలో జగన్‌ను, వైఎస్‌ఆర్‌సీపీని దుమ్ములేపారు. జరిగిన పొరపాటును గుర్తించిన వైఎస్‌ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌ టీమ్‌ క్షమాపణ కోరుతూ ఫొటో మార్చారు.

అయితే లోకేష్‌ ట్వీట్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అఫిషియల్‌ సోషల్‌మీడియా టీమ్‌ స్పందించకపోయినా పార్టీ అభిమానులు వెంటనే తీవ్రంగా స్పందించి గతంలో చంద్రబాబు గురజాడ కొటేషన్‌తో ట్వీట్‌ చేస్తూ “దేశమంటే మట్టి కాదోయ్‌” అని పెట్టబోయి “దేశమంటే మట్టి కదోయ్‌” అని ట్వీట్‌ చేసిన దానిని మళ్లీ ఇప్పుడు పోస్ట్‌ చేశారు.

అలాగే లోకేష్‌ ఒక సభలో మాట్లాడుతూ పొరపాటున “బంధుప్రీతి, మతపిచ్చి, కుల పిచ్చి… ఎక్కువగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయేనని గుర్తించండి” అన్న వీడియో క్లిప్పింగ్‌ను కూడా పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన టీడీపీ అభిమానులు గతంలో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా….. భారతదేశంలోని … రాష్ట్రాలలో 33వ రాష్ట్రం …. అంటూ పెట్టిన పోస్ట్‌ను ఇప్పుడు మళ్లీ స్ర్కీన్‌ షాట్‌ తీసి పోస్ట్‌చేసి, భారతదేశంలో ఎన్నిరాష్ట్రాలు ఉన్నాయోకూడా తెలియని వాళ్లకు పార్టీలు ఎందుకు? అని ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  1 Dec 2015 2:36 AM GMT
Next Story