Telugu Global
NEWS

గ్రేటర్‌ ఎన్నికల వేళ మరో అస్త్రాన్ని సంధించిన కేసీఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేసీఆర్‌ మరో అస్త్రాన్ని సంధించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. విద్యుత్‌ పెండింగ్‌ బిల్లుల  రద్దు వల్ల దాదాపు 6 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 50 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారే. నల్లా బకాయిలు రద్దుతో మూడు లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న కారణంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా […]

గ్రేటర్‌ ఎన్నికల వేళ మరో అస్త్రాన్ని సంధించిన కేసీఆర్
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేసీఆర్‌ మరో అస్త్రాన్ని సంధించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్, నల్లా బిల్లులు రద్దు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. విద్యుత్‌ పెండింగ్‌ బిల్లుల రద్దు వల్ల దాదాపు 6 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 50 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారే. నల్లా బకాయిలు రద్దుతో మూడు లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న కారణంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే బకాయిల రద్దు పథకం ప్రకటించనున్నారు.

First Published:  3 Dec 2015 7:28 AM GMT
Next Story