Telugu Global
NEWS

ఆ క‌లెక్ట‌ర్ చేసిన నేర‌మేంటంటే?

కోర్టు ధిక్కారం కేసులో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ర‌ఘునంద‌న‌రావుకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ. 2వేల జ‌రిమానా విధంచ‌డం సంచ‌లనంగా మారింది. అయితే అప్పీలు చేయ‌డానికి గాను అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థించిన‌ మేర‌కు శిక్ష‌ను నాలుగువారాల పాటు నిలుపుద‌ల చేశారు. ఇంత‌కీ క‌లెక్ట‌ర్ చేసిన నేరం ఏమిటంటే… రంగారెడ్డి జిల్లా సూరారం గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 107లో బ‌ల‌హీన‌వ‌ర్గాల కోసం నిర్మించిన గృహ స‌ముదాయాల్లో అన‌ధికారికంగా నివ‌సిస్తున్న 2,300 మందిని ఖాళీ చేయించాలంటూ […]

ఆ క‌లెక్ట‌ర్ చేసిన నేర‌మేంటంటే?
X

కోర్టు ధిక్కారం కేసులో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ర‌ఘునంద‌న‌రావుకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ. 2వేల జ‌రిమానా విధంచ‌డం సంచ‌లనంగా మారింది. అయితే అప్పీలు చేయ‌డానికి గాను అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థించిన‌ మేర‌కు శిక్ష‌ను నాలుగువారాల పాటు నిలుపుద‌ల చేశారు. ఇంత‌కీ క‌లెక్ట‌ర్ చేసిన నేరం ఏమిటంటే… రంగారెడ్డి జిల్లా సూరారం గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 107లో బ‌ల‌హీన‌వ‌ర్గాల కోసం నిర్మించిన గృహ స‌ముదాయాల్లో అన‌ధికారికంగా నివ‌సిస్తున్న 2,300 మందిని ఖాళీ చేయించాలంటూ 2007 జూలైలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకావ‌డంతో అధికారులు వారిని ఖాళీ చేయించ‌లేక‌పోయారు. దాంతో తీర్పు పున‌స్స‌మీక్ష కోరుతూ అధికారులు కోర్టులో పిటిషిన్ దాఖ‌లుచేయ‌గా కోర్టు దానిని కొట్టేసింది. దాంతో కోర్టు తీర్పును అమ‌లు చేయ‌డం లేదంటూ జిల్లా క‌లెక్ట‌ర్‌పై కోర్టు ధిక్కార పిటిష‌న్ దాఖ‌లైంది. ఉత్త‌ర్వుల అమ‌లుకు మ‌రింత గ‌డువు కావాల‌ని క‌లెక్ట‌ర్ అభ్య‌ర్థించిన‌ప్ప‌టికీ నిర్ణీత గ‌డువులోగా అక్ర‌మంగా నివాసం ఉంటున్న‌వారిని ఖాళీ చేయించ‌లేక‌పోయినందుకు గాను కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌లెక్ట‌ర్‌కు శిక్ష విధించింది. 2015 ఆగ‌స్లు 21లోగా 2,055 మంది అన‌ర్హుల‌ను ఇళ్ల నుంచి ఖాళీ చేయించాల్సి ఉండ‌గా అధికారులు 190 మందిని మాత్ర‌మే ఖాళీ చేయించ‌గ‌లిగార‌ట‌.

First Published:  3 Dec 2015 3:03 AM GMT
Next Story