Telugu Global
NEWS

నీటి తగ్గింపు సాయం కోరిన తమిళనాడు

వరదలతో అల్లాడిపోతున్న తమిళనాడుకు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్ర్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. నెల రోజులు కురవాల్సిన వర్షం ఒక్క గంటలో కురవడంతో చెన్నై పట్టణం చెరువైపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు … తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారు. సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ వైపు నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నారని కృష్ణారావు అడిగారు. ఇందుకు తమిళనాడు సీఎస్‌ నుంచి వచ్చిన మాటలు […]

నీటి తగ్గింపు సాయం కోరిన తమిళనాడు
X

వరదలతో అల్లాడిపోతున్న తమిళనాడుకు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్ర్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. నెల రోజులు కురవాల్సిన వర్షం ఒక్క గంటలో కురవడంతో చెన్నై పట్టణం చెరువైపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు … తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేశారు. సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ వైపు నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నారని కృష్ణారావు అడిగారు. ఇందుకు తమిళనాడు సీఎస్‌ నుంచి వచ్చిన మాటలు విని ఏపీ సీఎస్‌ ఆశ్చర్యపోయారు.

”మీరు సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు సార్‌. అయితే అన్నింటికి కన్నా ముందుగా మీరో సాయం చేయాలి. ఇప్పటికే మా ప్రాంతంలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలోని డ్యాంల నుంచి భారీగా నీటి ప్రవాహం మా ప్రాంతంలోకి వస్తోంది. కాబట్టి డ్యాంల నుంచి నీటి ప్రవాహాన్ని కాస్త నియంత్రించండి” అని కోరారు. ఇందుకు ఏపీ సీఎస్‌ కూడా సానుకూలంగా స్పందించారు. అవకాశం ఉన్న చోట నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.

First Published:  3 Dec 2015 1:40 AM GMT
Next Story