Telugu Global
Others

తెలంగాణ‌కు పొంచి ఉన్న లోటు ముప్పు!

తెలంగాణ స‌ర్కారు నిల్వ‌లో ఉంద‌ని, ఆదాయానికి ఎలాంటి ఢోకా లేద‌ని ఇప్ప‌టివ‌ర‌కు అంతా భావించారు. కానీ ఇపుడు లోటు ప్ర‌మాదం ముంచుకొస్తోంది. కాసుల క‌ష్టాలు పొంచి ఉన్నాయ‌ని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఒకేసారి అనేక ర‌కాల చెల్లింపులు, నిధుల కోత‌ రాష్ట్రప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయ‌బోతున్నాయి. వాటిలో కొన్ని… 1. రైతు ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో మిగిలిన రెండు ద‌ఫాల‌కు క‌లిపి ఏక‌మొత్తంలో రుణ‌మాఫీ చేయాల్సి వ‌స్తే..కావ‌ల‌సిన మొత్తం రూ. 8,500 కోట్లు. 2. క‌రువు మండ‌లాలుగా […]

తెలంగాణ‌కు పొంచి ఉన్న లోటు ముప్పు!
X
తెలంగాణ స‌ర్కారు నిల్వ‌లో ఉంద‌ని, ఆదాయానికి ఎలాంటి ఢోకా లేద‌ని ఇప్ప‌టివ‌ర‌కు అంతా భావించారు. కానీ ఇపుడు లోటు ప్ర‌మాదం ముంచుకొస్తోంది. కాసుల క‌ష్టాలు పొంచి ఉన్నాయ‌ని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఒకేసారి అనేక ర‌కాల చెల్లింపులు, నిధుల కోత‌ రాష్ట్రప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయ‌బోతున్నాయి. వాటిలో కొన్ని…
1. రైతు ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్యంలో మిగిలిన రెండు ద‌ఫాల‌కు క‌లిపి ఏక‌మొత్తంలో రుణ‌మాఫీ చేయాల్సి వ‌స్తే..కావ‌ల‌సిన మొత్తం రూ. 8,500 కోట్లు.
2. క‌రువు మండ‌లాలుగా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో రైతుల రుణాల‌న్నీ రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. ఆ భారం దీనికి అద‌నం. అంతేకాదు.. రీషెడ్యూల్ వ‌ల్ల పంట రుణాల‌పై 11శాతం వ‌డ్డీని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంది.
3. ఏడో పీఆర్సీ వ‌ల్ల ఖ‌జానాపై అద‌నంగా ప‌డుతున్న భారం రూ. 3,000 కోట్ల‌కు పైమాటే.
4. జీఎస్‌టీ వ‌ల్ల వాటిల్లే న‌ష్టం రూ.2,500 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.
5. జీఎస్‌టీ వ‌ల్ల‌ పెట్రోలియం ఉత్ప‌త్తుల అమ్మ‌కాల ద్వారా రాష్ర్టాల‌కు వ‌చ్చే ప‌న్నుల‌కు భారీ స్థాయిలో గండి ప‌డ‌నున్న‌ది. మాట ఇచ్చిన మేర‌కు అందులో 18శాతాన్ని కేంద్రం వెన‌క్కు ఇచ్చేస్తే స‌రి. లేదంటే రాష్ట్రంపై ప‌డే భారం రూ. 3,000 కోట్లు
6. ఈసారి కేంద్రం నుంచి ర‌క‌ర‌కాల ప‌థ‌కాల కింద రావ‌ల‌సిన రూ.25వేల కోట్ల నిధుల్లో వివిధ కార‌ణాల రీత్యా దాదాపు రూ. 2,000 కోట్ల వ‌ర‌కు కోత ప‌డ‌వ‌చ్చ‌ని అంచ‌నా.
ఒక‌వైపు అద‌న‌పు ఖ‌ర్చులు మ‌రోవైపు రావ‌ల‌సిన నిధుల కోత‌ల కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిర‌య్యేట్లు క‌నిపిస్తోంది. ఈ ఏడాది బ‌డ్జెట్ క‌స‌ర‌త్తు ఇప్పుడే మొద‌ల‌య్యింది. ఈ సంక్షోభం నుంచి స‌ర్కారు ఎలా బైట‌ప‌డుతుందో…
First Published:  4 Dec 2015 3:30 AM GMT
Next Story