Telugu Global
Others

ఇన్‌స్పిరేషన్ ఐకాన్‌గా కేటీఆర్, చరణ్

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటీఆర్‌ మరో ఘనత సాధించారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద లైఫ్ స్టైల్ మ్యాగజైన్ రిట్జ్-CNN IBN ఛానల్ కలిసి నిర్వహించిన ఇన్ స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేటీఆర్ సాధించారు. పరిపాలనలో ఉత్తమ ప్రమాణాలు, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడని ఈ సంస్థలు కేటీఆర్ ను ప్రశంసించాయి. ఈ మేరకు కేటీఆర్ కు జ్యూరీ అభినందనలతో కూడిన ఈ-మెయిల్ పంపింది. డిసెంబర్ 13న బెంగళూరులో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. కేటీఆర్ […]

ఇన్‌స్పిరేషన్ ఐకాన్‌గా కేటీఆర్, చరణ్
X

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కెటీఆర్‌ మరో ఘనత సాధించారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద లైఫ్ స్టైల్ మ్యాగజైన్ రిట్జ్-CNN IBN ఛానల్ కలిసి నిర్వహించిన ఇన్ స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేటీఆర్ సాధించారు. పరిపాలనలో ఉత్తమ ప్రమాణాలు, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడని ఈ సంస్థలు కేటీఆర్ ను ప్రశంసించాయి. ఈ మేరకు కేటీఆర్ కు జ్యూరీ అభినందనలతో కూడిన ఈ-మెయిల్ పంపింది. డిసెంబర్ 13న బెంగళూరులో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.

కేటీఆర్ తోపాటు పలువురి ప్రముఖులు కూడా అవార్డులు అందుకోనున్నారు. సినీరంగం నుంచి రామ్‌చరణ్‌ తేజను అవార్డు వరించింది. వ్యాపారం రంగంలో గ్రంధిమల్లిఖార్జున రావు, ప్యాషన్ రంగంలో గౌరంగ్ షా, సాంకేతిక రంగంలో నందన్ నిలేకనీ, చలన చిత్ర రంగంలో విద్యాబాలన్ కి అవార్డులను ప్రకటించింది. అవార్డు రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని.. ఐటీ రంగంలో మరింత ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కొత్త ఆలోచనలకు వేదికనిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ గుర్తింపు తనతోపాటు తెలంగాణ ప్రభుత్వాని కూడా దక్కిన గౌరవమని కేటీఆర్ అన్నారు.

First Published:  4 Dec 2015 12:14 AM GMT
Next Story