Telugu Global
Others

తెలంగాణ‌లో కొత్త ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ 112

కొత్త ఎమ‌ర్జెన్సీ నెంబ‌రు 112ను ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంపిక‌య్యింది. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు గాను దేశ‌వ్యాప్తంగా కేంద్రం ఈ కొత్త ఎమర్జెన్సీ నెంబ‌రును ఏర్పాటు చేయ‌నున్న‌ది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో కేంద్ర హోం శాఖ ఒక అవ‌గాహ‌నా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న 100, 108 త‌దిత‌ర ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల స్థానంలో దేశ‌వ్యాప్తంగా 112ను అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జాతీయ అత్య‌వ‌స‌ర స్పంద‌న వ్య‌వ‌స్థ […]

తెలంగాణ‌లో కొత్త ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ 112
X
కొత్త ఎమ‌ర్జెన్సీ నెంబ‌రు 112ను ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంపిక‌య్యింది. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు గాను దేశ‌వ్యాప్తంగా కేంద్రం ఈ కొత్త ఎమర్జెన్సీ నెంబ‌రును ఏర్పాటు చేయ‌నున్న‌ది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో కేంద్ర హోం శాఖ ఒక అవ‌గాహ‌నా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంద‌ని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న 100, 108 త‌దిత‌ర ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ల స్థానంలో దేశ‌వ్యాప్తంగా 112ను అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జాతీయ అత్య‌వ‌స‌ర స్పంద‌న వ్య‌వ‌స్థ ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టును కేంద్రం అమ‌లు చేస్తుంది. తొలుత‌గా గుజ‌రాత్‌, తెలంగాణ‌ల‌లో ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తారు. ఈ ప్రాజెక్టును అమ‌లు చేయ‌డానికి గాను దాదాపు రూ.100 కోట్ల విలువైన సాంకేతిక ప‌రిక‌రాలు కేంద్రం నుంచి తెలంగాణ‌కు అందుతాయ‌ని అధికారులు వివ‌రించారు. అయితే ఈ ప్రాజెక్టు అమ‌లు కావ‌డానికి మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని వారు తెలిపారు.
First Published:  4 Dec 2015 3:02 AM GMT
Next Story