Telugu Global
Others

బాగుండ‌టం....అంటే ఎంటో తెలుసా?

తెలిసిన‌వారు ఎవ‌రైనా కొంత విరామం త‌రువాత ఎదురుప‌డితే మ‌నం అడిగే మొద‌టి ప్ర‌శ్న‌…బాగున్నారా…అని.  ఈ ప్ర‌శ్న చిన్న‌గానే ఉన్నా, నిజానికి ఆరోగ్యం, ఆనందం, చురుకుద‌నం…ఇంకా ఇలాంటి  పాజిటివ్ పాయింట్లు ఎన్నో క‌లిస్తే కానీ అది పూర్తిగా బాగుండ‌టం అవ‌దు. కానీ మ‌న‌లో చాలామంది శ‌రీరంలో ఏ నొప్పులూ లేకుండా, ఒక్కోసారి నొప్పులు ఉన్నా కాస్త న‌డుస్తూ, త‌మ ప‌నులు తాము చేసుకోగ‌లిగితే చాలు… బాగున్న‌ట్టే అనుకుంటారు. ఇంత‌కీ బాగుండ‌టం అనే ప‌దానికి వైద్యులు ఇచ్చే నిర్వ‌చ‌నం ఎలా […]

బాగుండ‌టం....అంటే ఎంటో తెలుసా?
X

తెలిసిన‌వారు ఎవ‌రైనా కొంత విరామం త‌రువాత ఎదురుప‌డితే మ‌నం అడిగే మొద‌టి ప్ర‌శ్న‌…బాగున్నారా…అని. ఈ ప్ర‌శ్న చిన్న‌గానే ఉన్నా, నిజానికి ఆరోగ్యం, ఆనందం, చురుకుద‌నం…ఇంకా ఇలాంటి పాజిటివ్ పాయింట్లు ఎన్నో క‌లిస్తే కానీ అది పూర్తిగా బాగుండ‌టం అవ‌దు. కానీ మ‌న‌లో చాలామంది శ‌రీరంలో ఏ నొప్పులూ లేకుండా, ఒక్కోసారి నొప్పులు ఉన్నా కాస్త న‌డుస్తూ, త‌మ ప‌నులు తాము చేసుకోగ‌లిగితే చాలు… బాగున్న‌ట్టే అనుకుంటారు. ఇంత‌కీ బాగుండ‌టం అనే ప‌దానికి వైద్యులు ఇచ్చే నిర్వ‌చ‌నం ఎలా ఉంటుంది. ఏ ల‌క్ష‌ణాలు మ‌నిషిని ఆరోగ్య‌వంతుడ‌ని చెబుతాయి…ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమే ఈ అంశాలు-

  • గాఢంగా నిద్ర‌పోగ‌ల‌గాలి, ఉద‌యం నిద్ర‌లేవ‌గానే శ‌క్తిమంతంగా, ఉల్లాసంగా అనిపించాలి.
  • మ‌ల‌బ‌ద్ద‌కం లేని సాఫీ విరేచ‌నం అవ్వాలి.
  • రోజంతా ఒకేస్థాయిలో ఉత్సాహంగా ప‌నిచేయాలి.
  • పొట్ట లోతుగా ఛాతీ ఉన్న‌తంగా ఉండాలి.
  • ఒక్క‌ దుర‌ల‌వాటు, వ్య‌స‌నం కూడా ఉండ‌కూడ‌దు.
  • స్థిరంగా ప్ర‌శాంతంగా, సంతోషంగా ఉండ‌గ‌ల‌గాలి.
  • అల‌స‌ట లేకుండా గంట‌ల‌కొద్దీ ప‌నిచేయ‌గ‌ల‌గాలి.
  • కొత్త విష‌యాలు తెలుసుకోవ‌డం, నేర్చుకోవ‌డంలో బ‌ద్ద‌కం, భ‌యం ఉండ‌కూడ‌దు.
  • ముఖంలో మెరుపు ఉండాలి.
  • క‌ళ్ల‌లో వెలుగు, నిర్భ‌య‌త్వం క‌నిపించాలి.
  • ముఖంమీద చిరున‌వ్వు చెద‌ర‌కూడ‌దు.
  • వ‌య‌సు మీరినా ఆ ఫీలింగ్ రాకూడ‌దు, ఎల్ల‌ప్పుడూ నూత‌న శ‌క్తితో క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపించాలి.
  • కాలాన్ని దుర్వినియోగం చేయ‌కుండా ఏదో ఒక ఉత్పాద‌క‌త‌నిచ్చే ప‌ని చేయ‌గ‌ల‌గాలి. ఆలోచ‌న‌లు సైతం అలాగే ఉండాలి.
  • శ‌రీరం ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా స‌క్ర‌మంగా ప‌నిచేయాలి.
  • మృదువుగా మాట్లాడాలి.

అమ్మో…బాగుండ‌టంలో ఇంత మ‌హాభార‌తం ఉందా అనిపిస్తోంది క‌దూ. నిజానికి ఈ ల‌క్ష‌ణాలన్నీ ఉంటేనే బాగున్న‌ట్టు అయితే ఈ ప్ర‌పంచంలో ఏ మ‌నిషీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాన‌ట్టే అనుకోవాలి. అలాగే ఈ ల‌క్ష‌ణాల్లో ఏ కొన్ని లేక‌పోయినా అది ఆ మ‌నిషి జీవితం మీదే కాదు, అత‌ని చుట్టూ ఉన్న స‌మాజంమీద కూడా ప్ర‌భావాన్ని చూపుతుంది. కాబ‌ట్టి ఈ బాగుండ‌టంలో దాగి ఉన్న అంశాల్లో వ్య‌క్తి ఆరోగ్య‌మే కాక‌ సామాజిక ఆరోగ్య‌మూ మిళిత‌మై ఉంద‌న్న‌మాట‌.

First Published:  3 Dec 2015 5:04 PM GMT
Next Story