Telugu Global
Cinema & Entertainment

మ‌హేశ్ ఫేవ‌రేట్ హీరోయిన్ మారిందా?

టాలీవుడ్ మిల్కీబాయ్ మ‌హేశ్‌బాబు మీ క‌ల‌ల సుంద‌రి ఎవ‌రు అని ఎప్పుడు అడిగినా శ్రీ‌దేవి పేరు చెప్తాడు. అందులో డౌటేలేదు. కానీ, కొంత‌కాలంగా మీకు న‌చ్చిన బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రు అని అడిగితే మాత్రం దీపికా ప‌డుకోన్ పేరు చెబుతున్నాడు. దీని వెన‌క చాలా క‌థే ఉంది. స‌హ‌జంగానే రిజ‌ర్వుడుగా ఉండే మ‌హేశ్ ఎవ‌రితోనూ అంత సులువుగా క‌లిసిపోడు. మిత్రులు కూడా చాలా తక్కువ‌. సింప్లిసిటీకి అధిక ప్రాధాన్య‌మిస్తాడు. ఇటీవ‌ల విడుద‌లైన పీకూ సినిమా చూసిన త‌రువాత […]

మ‌హేశ్ ఫేవ‌రేట్ హీరోయిన్ మారిందా?
X
టాలీవుడ్ మిల్కీబాయ్ మ‌హేశ్‌బాబు మీ క‌ల‌ల సుంద‌రి ఎవ‌రు అని ఎప్పుడు అడిగినా శ్రీ‌దేవి పేరు చెప్తాడు. అందులో డౌటేలేదు. కానీ, కొంత‌కాలంగా మీకు న‌చ్చిన బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రు అని అడిగితే మాత్రం దీపికా ప‌డుకోన్ పేరు చెబుతున్నాడు. దీని వెన‌క చాలా క‌థే ఉంది. స‌హ‌జంగానే రిజ‌ర్వుడుగా ఉండే మ‌హేశ్ ఎవ‌రితోనూ అంత సులువుగా క‌లిసిపోడు. మిత్రులు కూడా చాలా తక్కువ‌. సింప్లిసిటీకి అధిక ప్రాధాన్య‌మిస్తాడు. ఇటీవ‌ల విడుద‌లైన పీకూ సినిమా చూసిన త‌రువాత మ‌హేశ్ అందులో దీపిక న‌ట‌న‌కు ముగ్ధుడయ్యాడ‌ట‌. వెంట‌నే ఫోన్ చేసి దీపిక‌కు కంగ్రాట్స్ చెప్పాడ‌ని స‌మాచారం. ఈ రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్ల‌లో అభినయం త‌గ్గ‌లేద‌ని దీపిక రుజువు చేసింద‌న్న‌ది మ‌హేశ్ అభిమ‌తం.
క‌లిసి చేస్తారా?
మ‌హేశ్ బాలీవుడ్‌లో సినిమా చేస్తాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగుతోంది. గ‌త‌నెల‌లో మ‌హేశ్ ముంబైలో ఇల్లు కూడా కొన్న విష‌యం తెలిసిందే! ముంబైలో షూటింగ్‌ల‌కు ఇబ్బంది కాకూడ‌ద‌నే ముందు జాగ్ర‌త్త‌గా మ‌హేశ్ ఇల్లు కొన్నాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అంటే మ‌హేశ్‌ బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ దీపికే అవుతుందా? అన్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. వీరిద్ద‌రి ప్రాజెక్టుల ప‌రంగా చూస్తే క‌లిసి న‌టించేందుకు దాదాపు రెండేళ్ల దాకా ఇద్ద‌రి డేట్లు ఖాళీ లేవు. ప్రేక్ష‌కులకి ఈ జంట‌ను తెర‌పై చూడాల‌న్న కోరిక ఉన్నా.. అది ఇప్ప‌ట్లో నెర‌వేరే అవ‌కాశాలు తక్కువే అంటున్నారు సినీజ‌నాలు.
First Published:  5 Dec 2015 12:06 AM GMT
Next Story