Telugu Global
Others

లంచాలపై రాజధాని పన్ను

లంచాలపై రాజధాని పన్ను. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ పన్నును ప్రభుత్వం వసూలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు అధికారులే వసూలు చేస్తున్నారు. ఎవరి నుంచి అంటే సామాన్య జనం నుంచి. అది ఎలాగంటే… ఇది వరకు సామాన్య ప్రజలు అధికారుల దగ్గరకు ఏదేని పని మీద వస్తే అంతో ఇంతో లంచం తీసుకుని పనిచేసి పంపేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండడం… ముఖ్యమంత్రి, మంత్రులు […]

లంచాలపై రాజధాని పన్ను
X

లంచాలపై రాజధాని పన్ను. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ పన్నును ప్రభుత్వం వసూలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు అధికారులే వసూలు చేస్తున్నారు. ఎవరి నుంచి అంటే సామాన్య జనం నుంచి. అది ఎలాగంటే… ఇది వరకు సామాన్య ప్రజలు అధికారుల దగ్గరకు ఏదేని పని మీద వస్తే అంతో ఇంతో లంచం తీసుకుని పనిచేసి పంపేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.

ఏపీ సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండడం… ముఖ్యమంత్రి, మంత్రులు విజయవాడలో ఉంటుండడంతో అదనపు లంచం వసూలు చేసేందుకు అధికారులకు సాకు దొరికింది. ”మంత్రి గారి ఇక్కడ లేరు.. విజయవాడలో ఉన్నారు. హైదరాబాద్‌ రావడానికి వారం పడుతుంది. ఆలోపు పనికావాలంటే మేమే ఫైల్‌ తీసుకుని విజయవాడ పోవాలి. అలా చేయాలంటే రానూపోనూ చార్జీలు, ఇతర ఖర్చులు చాలా అవుతాయి” అని చెబుతున్నారు.

చివరకు టీఏ, డీఏ అని సామాన్యుల నుంచి సాధారణంగా తీసుకుని దానికి అదనంగా లంచం తీసుకుంటున్నారు. అయితే ఇలా అదనంగా తీసుకున్న లంచం డబ్బుతో నిజంగానే విజయవాడ వెళ్లి ఫైల్‌పై సంతకం చేయించుకు వస్తారా అంటే అదేమీ లేదు. సదరు మంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడే సంతకాలు చేయిస్తారు. పేరుకు మాత్రం కొత్త రాజధానికి ఫైల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పి అదనంగా జనం రక్తం తాగుతున్నారు. అదన్న మాట… రాజధాని పేరుతో లంచాలపై అధికారులు వసూలు చేస్తున్న అవినీతి పన్ను.

First Published:  5 Dec 2015 4:53 AM GMT
Next Story