శ్రీ‌దేవికి కూతుళ్ల త‌ల‌నొప్పి

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవికి త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఇండ‌స్ట్రీలో శ్రీ‌దేవికి ఉన్న పేరును చెడ‌గొట్టేలా ఆమె కూతుళ్లు ప్ర‌వర్తిస్తున్నార‌ని అభిమానులు వాపోతున్నారు. శ్రీ‌దేవి ఇద్ద‌రు కూతుళ్లు జాహ్నవి, ఖుషీలు త‌ర‌చుగా ప‌బ్‌ల్లో క‌నిపిస్తూ మీడియా కంట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. పొట్టిపొట్టి ద‌స్తుల‌తో 18 ఏళ్లైనా నిండ‌కుండానే.. వీలైనంత స్కిన్ షో చేస్తున్నారు. దీనికితోడు మిడ్‌నైట్ పార్టీల్లో తాగుతూ క‌నిపించ‌డం శ్రీ‌దేవి అభిమానుల‌ను విస్మ‌య‌ ప‌రిచేలా చేస్తోంది.
అతిలోక సుంద‌రి ఆందోళ‌న‌!
శ్రీ‌దేవి చిన్న కూతురుకు నిండా 15 ఏళ్లు లేవు. పిట్ట కొంచెం కూత ఘ‌నం అన్న‌ట్లుగా ఉంది ఈమె వ్య‌వహారం. ఆ మ‌ధ్య సైఫ్ అలీఖాన్ కొడుకుతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. మ‌రోసంద‌ర్భంలో పాప్ సింగ్ జాక్ గిలెన్సికీని ముద్దాడుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌లా పాకింది. ముఖ్యంగా పెద్ద‌కూతురు జాహ్నవి విష‌యంలో శ్రీ‌దేవి తీవ్ర ఆందోళ‌న‌గా ఉంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల న్యూయార్క్ లోని ఓ ప‌బ్‌లో జాహ్న‌వి తాగుతూ చిందులేసిన ఫొటోలు మీడియాకు చిక్క‌డంతో శ్రీ‌దేవి ఆమెను మంద‌లించింద‌ని తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినా.. కూతుళ్ల తీరులో మార్పు లేక‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌క‌ త‌ల ప‌ట్టుకుంటుంద‌ట శ్రీ‌దేవి. కూతుళ్ల‌ను హీరోయిన్ల‌ను చేద్దామ‌ని తాను ప్ర‌య‌త్నాలు చేస్తోంటే.. కెరీర్ పై సీరియ‌స్‌గా లేని వారితో ఎలా వేగాలో ఈ అతిలోక సుంద‌రికి పాలుపోవ‌డం లేద‌ట‌!