“థ్యాంక్స్‌” చెప్పినందుకు బదిలీ చేయించిన బాలయ్య పీఏ

బాలకృష్ణ ఏపీ శేఖర్  తీరు నచ్చక హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బాలయ్య పీఏ తీరు తొలి నుంచి కూడా వివాదాస్సదంగానే ఉందని నేతలు చెబుతున్నారు.  నియోజకవర్గంలో బాలకృష్ణ కన్నా ఆయన పీఏ శేఖరే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.   శేఖర్‌ గురించి పదేపదే ఒక సంఘటనను గుర్తు చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం చిలమత్తూరు మండల టీడీపీ నాయకుల సమావేశంలో గొడవ జరిగింది. బాలకృష్ణ పీఏపై ఒక టీడీపీ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ విషయాన్ని కొందరు”బాలయ్య పీఏపై ఆరోపణలు” అంటూ ఒక ఫోటోను  వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. ఈ గ్రూప్‌లో కొందరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. దీంతో ఆ ఫోటో మేసేజ్ అందరికీ చేరిపోయింది. అయితే ఎవరూ ఏ మేసేజ్ పంపినా థ్యాంక్స్ చెప్పే అలవాటున్న హిందూపురం రూరల్‌ పీఎస్‌లోని ఓ ఏఎస్‌ఐ బాలయ్య ఫోటోను పంపిన వారికి కూడా థ్యాంక్స్ అని బదులిచ్చారు. ఈ విషయాన్ని బాలయ్య పీఏ శేఖర్‌ మరో విధంగా అర్థం చేసుకున్నారు. టీడీపీ వాళ్లు గొడవ పడితే ఏఎస్‌ఐకి ఎందుకంత సంతోషం అంటూ డీఎస్పీ దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే సదరు ఏఎస్‌ఐ వెంటనే బదిలీ అయిపోయారు. అదన్నమాట బాలయ్య పీఏకున్న పవన్‌.