Telugu Global
Others

విమర్శకులు లేని సయోధ్య చర్చలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో వాటికి చెక్ పెట్టాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకున్నాయి. ఈ భేటీలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోరాదని..  ఇకనుంచి ప్రతినెలా సమన్వకమిటీ సమావేశం నిర్వహించుకోవాలని తీర్మానించారు. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి సీఎం చంద్రబాబు పెద్దగా వ్యవహరించారు. ఇక నుంచి ఇరు పార్టీలకు చెందిన నాయకులు బహిరంగంగా తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం […]

విమర్శకులు లేని సయోధ్య చర్చలు
X
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో వాటికి చెక్ పెట్టాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకున్నాయి. ఈ భేటీలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోరాదని.. ఇకనుంచి ప్రతినెలా సమన్వకమిటీ సమావేశం నిర్వహించుకోవాలని తీర్మానించారు. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి సీఎం చంద్రబాబు పెద్దగా వ్యవహరించారు. ఇక నుంచి ఇరు పార్టీలకు చెందిన నాయకులు బహిరంగంగా తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం మానాలని తీర్మానించారు.
వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఇరు పార్టీలు ఎంత సఖ్యతగా ఉన్నాయో ఇప్పుడూ అలాగే పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి టీడీపీ తరుపున జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ కొనకళ్ల, బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పలువురు హాజరయ్యారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై ఒంటికాలుపై లేచి విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు గానీ.. కావూరి సాంబశివరావుగానీ, పురంధేశ్వరిగానీ హాజరుకాలేదు. దీంతో ఈ సమన్వయ కమిటీ వల్ల ప్రయోజనం ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిజానికి చంద్రబాబు ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నది ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ లాంటి నేతలే. అయితే బీజేపీ, టీడీపీ వేసిన సమన్వయ కమిటీలో వీరిపేర్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఏమీ లేదు. పైగా ఈ సమావేశానికి హాజరైన వారంతా వెంకయ్య నాయుడు అనుచరులు, చంద్రబాబు భజన పరులేనని చెప్పుకుంటున్నారు. నిజానికి వాళ్లంతా ఎప్పుడూ టీడీపీనిగానీ, చంద్రబాబును కానీ విమర్శించలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొందరు నేతలు కలిసి చేసుకున్న తీర్మానాన్ని సోము వీర్రాజు, పురంధేశ్వరి, కావూరి లాంటి వాళ్లు పాటిస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
బీజేపీలో బాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలను పక్కన పెట్టాలన్న ప్రణాళికతోనే ఈ మీటింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశం తర్వాత టీడీపీ ప్రభుత్వంతోపాటు చంద్రబాబుపై బీజేపీలోని ఓవర్గం నేతలు ఎంతకాలం విమర్శలు చేయకుండా ఉంటారో చూడాలి మరి.
First Published:  6 Dec 2015 2:44 AM GMT
Next Story