Telugu Global
NEWS

బెజవాడలో కల్తీ లిక్కర్‌- ఏడుగురు మృతి

బెజవాడలో విషాదం చోటు చేసుకుంది. కల్తీమద్యం తాగి ఏడుగురు చనిపోయారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణలంక స్వర్ణబార్‌లో మద్యం సేవించిన వారు వెంటనే బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయారు. గిలగిల కొట్టుకుంటున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. మిగిలిన వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం కల్తీ అవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్వర్ణబార్‌ను […]

బెజవాడలో కల్తీ లిక్కర్‌- ఏడుగురు మృతి
X

బెజవాడలో విషాదం చోటు చేసుకుంది. కల్తీమద్యం తాగి ఏడుగురు చనిపోయారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణలంక స్వర్ణబార్‌లో మద్యం సేవించిన వారు వెంటనే బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయారు. గిలగిల కొట్టుకుంటున్న వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. మిగిలిన వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం కల్తీ అవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారులు స్వర్ణబార్‌ను సీజ్‌ చేసి మద్యం శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపారు. మరోవైపు బాధితులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత జిల్లాలోనే ఈ ఘటన చర్చనీయాంశమైంది.

ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

First Published:  7 Dec 2015 2:16 AM GMT
Next Story