Telugu Global
NEWS

అమితాబ్‌ను ఏపీ ఎందుకు వాడుకోవడం లేదు?

11 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ బచ్చన్‌ను నియమించబోతున్నారని వార్తలొచ్చాయి. బిగ్‌బిని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ అండ్ హెల్త్ విభాగానికి అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు జనవరిలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా స్వయంగా చెప్పారు. అందుకోసం బచ్చన్‌తో మంత్రి స్వయంగా చర్చలు జరిపారు. ఇంకో విషయం ఏమిటంటే అమితాబచ్చన్‌ ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోకుండానే సేవలందించేందుకు ముందుకొచ్చారని అప్పట్లో కామినేని చెప్పారు. అయితే ఇప్పటికి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ అమితాబ్ నియామకానికి సంబంధించి ఎలాంటి […]

అమితాబ్‌ను ఏపీ ఎందుకు వాడుకోవడం లేదు?
X

11 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్‌ బచ్చన్‌ను నియమించబోతున్నారని వార్తలొచ్చాయి. బిగ్‌బిని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ అండ్ హెల్త్ విభాగానికి అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు జనవరిలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా స్వయంగా చెప్పారు. అందుకోసం బచ్చన్‌తో మంత్రి స్వయంగా చర్చలు జరిపారు. ఇంకో విషయం ఏమిటంటే అమితాబచ్చన్‌ ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోకుండానే సేవలందించేందుకు ముందుకొచ్చారని అప్పట్లో కామినేని చెప్పారు. అయితే ఇప్పటికి దాదాపు ఏడాది కావొస్తోంది.

కానీ అమితాబ్ నియామకానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. అసలు ఆ విషయమే మరిచిపోయారు. అమితాబ్ లాంటి వ్యక్తి అంబాసిడర్‌గా ఉంటానంటున్నా… అది కూడా పైసా తీసుకోకుండా సేవలందిస్తానని చెప్పినా ఏపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందన్నది అంతుచిక్కని ప్రశ్న. ఒకవేళ బిగ్‌బి డబ్బు తీసుకోవడం లేదని ప్రభుత్వం పైకి చెబుతున్నా … ఉత్తర్వులు రాకపోవడానికి కారణం ప్యాకేజ్ విషయమే అయి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఒకవేళ అమితాబ్ నిజంగానే ఉచితంగా సేవలందించేందుకు ముందుకొస్తుంటే ఈ విషయంలో ప్రభుత్వం వీలైనంత వేగంగా స్పందించి ముందుకెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  6 Dec 2015 8:01 PM GMT
Next Story