Telugu Global
Others

ఆది ఎంట్రీకి గంటా బుజ్జగింపులు

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోతారని కొద్దిరోజుల క్రితం బాగా ప్రచారం జరిగింది. అయితే మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆదినారాయణ ఎంట్రీపై టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకురావడంపై టీడీపీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న గంటాశ్రీనివాస్‌రావు ఆదివారం రామసుబ్బారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమైంది. ప్రొద్దుటూరులోని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అల్లుడి నివాసంలో […]

ఆది ఎంట్రీకి గంటా బుజ్జగింపులు
X

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిపోతారని కొద్దిరోజుల క్రితం బాగా ప్రచారం జరిగింది. అయితే మాజీ మంత్రి, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆదినారాయణ ఎంట్రీపై టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకురావడంపై టీడీపీ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న గంటాశ్రీనివాస్‌రావు ఆదివారం రామసుబ్బారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమైంది. ప్రొద్దుటూరులోని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అల్లుడి నివాసంలో ఈ చర్చలు జరిగాయి.

రామసుబ్బారెడ్డితో గంటా ఏకాంతంగా చర్చించారు. ఆదినారాయణరెడ్డి ఎంట్రీపై చంద్రబాబు మనోగతాన్ని రామసుబ్బారెడ్డికి గంటా వివరించారని సమాచారం. జగన్‌ను కట్టడి చేయాలంటే సొంత జిల్లాలోనే బలహీనపరచాల్సి ఉంటుందని… కాబట్టి ఆదినారాయణరెడ్డి రాకను వ్యతిరేకించవద్దని గంటా కోరినట్టు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచన కూడా ఇదేనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ”ఆదినారాయణరెడ్డి వచ్చినా మీ ప్రాధాన్యత తగ్గదు” అని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే వారిద్దరూ విషయాన్ని అధికారికంగా బయటకు వెల్లడించడం లేదు.

First Published:  7 Dec 2015 12:49 AM GMT
Next Story