Telugu Global
Others

ఈ అయిదూ...ఆ స‌మ‌స్య‌కు ఔష‌ధాలు

పొట్ట‌లో అసౌక‌ర్యం, అజీర్తి, గ్యాస్…ఇలాంటి స‌మ‌స్య‌లు చాలా త‌ర‌చుగా మ‌న‌కు ఎదుర‌వుతుంటాయి. పార్టీలు, పెళ్లిళ్లు, బంధువులు స్నేహితుల‌తో భోజ‌నాలు, వేళ‌దాటిపోయాక తిన‌డం ఇలాంటి సంద‌ర్భాలు  అజీర్తి, గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి. ఒక్కోసారి ఈ స‌మ‌స్య‌లు వ‌ద‌ల‌కుండా దీర్ఘ‌కాలం వెంటాడతాయి.  వీటికి మ‌న వంటింట్లోనే రెడీమేడ్ ఔష‌ధాలున్నాయి….గుర్తుపెట్టుకుని క్ర‌మం త‌ప్ప‌కుండా వాటిని వాడుతుంటే ఈ స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. సైడ్ ఎఫెక్ట్‌లు లేని స‌హ‌జ చికిత్స‌లు ఇవి- త‌గిన మోతాదులో ఒక చిన్న‌పాటి అల్లంముక్క‌ని భోజ‌నం ముందు తింటూ […]

ఈ అయిదూ...ఆ స‌మ‌స్య‌కు ఔష‌ధాలు
X

పొట్ట‌లో అసౌక‌ర్యం, అజీర్తి, గ్యాస్…ఇలాంటి స‌మ‌స్య‌లు చాలా త‌ర‌చుగా మ‌న‌కు ఎదుర‌వుతుంటాయి. పార్టీలు, పెళ్లిళ్లు, బంధువులు స్నేహితుల‌తో భోజ‌నాలు, వేళ‌దాటిపోయాక తిన‌డం ఇలాంటి సంద‌ర్భాలు అజీర్తి, గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి. ఒక్కోసారి ఈ స‌మ‌స్య‌లు వ‌ద‌ల‌కుండా దీర్ఘ‌కాలం వెంటాడతాయి. వీటికి మ‌న వంటింట్లోనే రెడీమేడ్ ఔష‌ధాలున్నాయి….గుర్తుపెట్టుకుని క్ర‌మం త‌ప్ప‌కుండా వాటిని వాడుతుంటే ఈ స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. సైడ్ ఎఫెక్ట్‌లు లేని స‌హ‌జ చికిత్స‌లు ఇవి-

  • త‌గిన మోతాదులో ఒక చిన్న‌పాటి అల్లంముక్క‌ని భోజ‌నం ముందు తింటూ ఉంటే పొట్ట‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు వేధించ‌వు.
  • వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువ‌గా తీసుకున్నా గ్యాస్ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే మ‌న‌కు తెలుసు. వెల్లుల్లిని ఒక పురాత‌న వంటింటి ఔష‌ధంగా చెప్ప‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల‌న అది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  • ఒక టేబుల్ స్ఫూను జీల‌క‌ర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా వ‌చ్చి ఇబ్బంది పెట్టే గ్యాస్ స‌మ‌స్య నెమ్మ‌దిస్తుంది.
  • ఉద‌యాన్నే ఏమీ తిన‌కుండా, తుల‌సి ఆకుల నుండి తీసిన ర‌సాన్ని మంచినీళ్ల‌లో క‌లిపి తాగుతుంటే.. క్ర‌మంగా జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.
  • పుదీనా ఆకుల‌తో త‌యారుచేసిన టీ కూడా గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.
First Published:  7 Dec 2015 6:03 PM GMT
Next Story