Telugu Global
Others

హెరిటేజ్ బ్రాండ్‌నూ వాడేస్తున్నారు

ఎర్రచందనం దొంగలు తెలివిమీరిపోతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ బ్రాండ్‌ను కూడా వాడేశారు. హెరిటేజ్‌ పాల రవాణా ముసుగులో ఎర్రచందనం తరలిస్తున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వాహనంపై హెరిటేజ్ లోగో ఉంటే పోలీసులు అడ్డుకోరన్న ఉద్దేశంతో దుండగులు ఈ పనిచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తిరుపతి సమీపంలోని ఎంఆర్‌పల్లి వద్ద హైవేపై పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో హెరిటేజ్ లోగో ఉన్న […]

హెరిటేజ్ బ్రాండ్‌నూ వాడేస్తున్నారు
X

ఎర్రచందనం దొంగలు తెలివిమీరిపోతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ బ్రాండ్‌ను కూడా వాడేశారు. హెరిటేజ్‌ పాల రవాణా ముసుగులో ఎర్రచందనం తరలిస్తున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వాహనంపై హెరిటేజ్ లోగో ఉంటే పోలీసులు అడ్డుకోరన్న ఉద్దేశంతో దుండగులు ఈ పనిచేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

తిరుపతి సమీపంలోని ఎంఆర్‌పల్లి వద్ద హైవేపై పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో హెరిటేజ్ లోగో ఉన్న పాలవ్యాన్ వచ్చింది. హెరిటేజ్‌లోగా ఉంది కాబట్టి పోలీసులు అడ్డుకోరని వ్యాన్‌లోని వారు భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు వ్యాన్‌ నిలిపి తనిఖీలు చేశారు. ఈ సమయంలోనే వ్యాన్‌లో ఉన్న వారు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. దీంతో క్షుణ్ణంగా పరిశీలించగా పాలవ్యాన్‌లో ఎర్రచందనం తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు బయటపడ్డాయి. వ్యాన్‌పై నెంబర్‌ ప్లేట్ కూడా నకిలీదని తేలింది. వ్యాన్‌ను వెంటనే సీజ్ చేశారు. దీనిపై హెరిటేజ్ కంపెనీ అధికారులను పోలీసులు సంప్రదించారు. అయితే సదరు పాలవ్యాన్‌కు హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలింది.

First Published:  7 Dec 2015 10:06 PM GMT
Next Story