Telugu Global
Others

రెడ్డి భుజంపై నుంచి గురి పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయోగిస్తున్న రాజకీయ అస్త్రాలు విపక్షాలకు అంతు చిక్కడం లేదు. తెలంగాణలో  కాంగ్రెస్‌ను భుజాలపై మోస్తున్న రెడ్డి సామాజికవర్గంపైనే కేసీఆర్‌ కన్నేసినట్టు కనిపిస్తోంది. రెడ్డిసామాజికవర్గాన్ని తన ప్రత్యర్థిగా చూడకుండా పదవుల్లో సదరు సామజికవర్గానికే పెద్ద పీట వేస్తుండడం చర్చనీయాంశమైంది. మంత్రి వర్గంతో పాటు తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ రెడ్డి నాయకులే అధికంగా ఉన్నారు. మొత్తం 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో దాదాపు సగం మంది రెడ్డి వర్గీయులే ఉన్నారు. ఈ సమీకరణ బట్టి […]

రెడ్డి భుజంపై నుంచి గురి పెట్టిన కేసీఆర్‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయోగిస్తున్న రాజకీయ అస్త్రాలు విపక్షాలకు అంతు చిక్కడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను భుజాలపై మోస్తున్న రెడ్డి సామాజికవర్గంపైనే కేసీఆర్‌ కన్నేసినట్టు కనిపిస్తోంది. రెడ్డిసామాజికవర్గాన్ని తన ప్రత్యర్థిగా చూడకుండా పదవుల్లో సదరు సామజికవర్గానికే పెద్ద పీట వేస్తుండడం చర్చనీయాంశమైంది. మంత్రి వర్గంతో పాటు తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలోనూ రెడ్డి నాయకులే అధికంగా ఉన్నారు. మొత్తం 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో దాదాపు సగం మంది రెడ్డి వర్గీయులే ఉన్నారు.

ఈ సమీకరణ బట్టి చూస్తుంటే సామాజిక కోణం కన్నా గెలుపుకే కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థమవుతోంది. ఇలా రెడ్డి సామాజికవర్గాన్ని ప్రోత్సహించడం ద్వారా కేసీఆర్‌ రెండు ప్రయోజనాలను ఆశిస్తుండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం ద్వారా ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం అందులో ఒకటని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా రెడ్డి ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ నుంచి చీల్చవచ్చనే ఎత్తుగడ కూడా ఉందని భావిస్తున్నారు.

Click to Read: Is TDP getting washed out in Hyderabad?

ఇప్పటికీ దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు. అక్కడి జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. ఈ కోణాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ ప్రాంతంలో రెడ్డి అభ్యర్థులను ఎమ్మెల్సీ బరిలో దింపుతున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్‌ పెద్ద పీట వేశారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా …

మహబూబ్‌నగర్ జిల్లా – సుంకిరెడ్డి జగదీశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా – శంభీపూర్ రాజు, పట్నం నరేందర్‌రెడ్డి
కరీంనగర్ జిల్లా – నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్
వరంగల్ జిల్లా – కొండా మురళి
మెదక్ జిల్లా – భూపాల్‌రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా – పురాణం సతీష్
ఖమ్మం జిల్లా – బాలసాని లక్ష్మీనారాయణ
నిజామాబాద్ జిల్లా – భూపతిరెడ్డి
నల్లగొండ జిల్లా – తేరా చిన్నపరెడ్డి

First Published:  8 Dec 2015 12:26 PM GMT
Next Story