Telugu Global
Others

బీజేపీకి వందల కోట్ల విరాళాలు- అంతా గోప్యమే

రాజకీయ పార్టీలను కార్పొరేట్ సంస్థలు చందాలతో కొడుతున్నాయి. వందల కోట్లు పార్టీ విరాళం పేరుతో ఇచ్చి తమ పనులను చక్కబెట్టుకుంటున్నాయి. 2014-15 ఏడాదికి గాను రాజకీయ పార్టీలు తమకందిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాయి. వీటిని అసోసియేషన్‌ ఫర్ డెమొక్రటిక్‌ రిఫార్మ్ సంస్థ బయటకు తెచ్చింది. ఈసీకి పార్టీలు అందించిన వివరాల బట్టి చూస్తే అంతకు ముందు ఏడాది కంటే విరాళాల మొత్తం 151 శాతం పెరిగింది. అన్ని పార్టీలకు కలిపితే 620 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. […]

బీజేపీకి వందల కోట్ల విరాళాలు- అంతా గోప్యమే
X

రాజకీయ పార్టీలను కార్పొరేట్ సంస్థలు చందాలతో కొడుతున్నాయి. వందల కోట్లు పార్టీ విరాళం పేరుతో ఇచ్చి తమ పనులను చక్కబెట్టుకుంటున్నాయి. 2014-15 ఏడాదికి గాను రాజకీయ పార్టీలు తమకందిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాయి. వీటిని అసోసియేషన్‌ ఫర్ డెమొక్రటిక్‌ రిఫార్మ్ సంస్థ బయటకు తెచ్చింది. ఈసీకి పార్టీలు అందించిన వివరాల బట్టి చూస్తే అంతకు ముందు ఏడాది కంటే విరాళాల మొత్తం 151 శాతం పెరిగింది. అన్ని పార్టీలకు కలిపితే 620 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి.

అత్యధిక మొత్తంలో విరాళాలు అందుకున్న పార్టీగా బీజేపీ అగ్రస్థానంలో ఉంది. 2014-15 ఏడాదికి గాను బీజేపీకి 437 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. అందుకు ముందు ఏడాది మాత్రం బీజేపీకి 170 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో వచ్చాయి. కాంగ్రెస్‌కు 2014-15 ఏడాదిలో 141 కోట్ల రూపాయలు అందాయి. సీపీఎంకు రూ. 3. 42 కోట్లు, సీపీఐకి రూ. 1.33 కోట్లు వచ్చాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారిలో 49 శాతం మంది అడ్రస్ వివరాలు కూడా లేవు. బీజేపీ పాన్ వివరాల్లో భారీగా తేడాలున్నాయి. పార్టీలకు అందిన మొత్తంలో 73 శాతం నిధులు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చినవే కావడం విశేషం.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి కార్పొరేట్‌ సంస్థల కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం మనదేశంలో అనవాయితీగా మారింది. ఇలా పార్టీ విరాళం పేరుతో భారీగా సొమ్ము ముట్టజెప్పి తమకు కావాల్సిన పనులు చేయించుకోవడం ఇప్పుడు నడుస్తున్న కార్పొరేట్ రాజకీయం.

First Published:  8 Dec 2015 11:57 PM GMT
Next Story