Telugu Global
Others

తదుపరి బీజేపీ అధ్యక్షుడు ఎవరు?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. అక్టోబర్‌తో ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ మొదలైంది. అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ జిల్లాలోని నాయకులతో మంచి సంబంధాలున్న ఇంద్రసేనారెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఓ దశలో […]

తదుపరి బీజేపీ అధ్యక్షుడు ఎవరు?
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. అక్టోబర్‌తో ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ మొదలైంది. అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ జిల్లాలోని నాయకులతో మంచి సంబంధాలున్న ఇంద్రసేనారెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఓ దశలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్‌రావును స్టేట్‌కు తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం జాతీయ రాజకీయాలను వదిలిపెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
కొందరు మరో ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ శాసనసభ పక్షనేతగా ఉన్న లక్ష్మణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి… కిషన్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దీని వల్ల కిషన్ రెడ్డికి కూడా సరైన స్థానం కల్పించినట్టు అవుతుందని చెబుతున్నారు. ఇందుకు లక్ష్మణ్‌ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు పదవులు మార్చుకుంటారు సరే మరి మా సంగతి ఏమిటని మిగిలిన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారయణ కూడా అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి సేవ చేస్తామంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే ఎవరైతే బాగుంటుందన్న దానిపై బీజేపీ అధినాయకత్వం తర్జనభర్జన పడుతోంది.

First Published:  9 Dec 2015 1:54 AM GMT
Next Story