Telugu Global
Cinema & Entertainment

అవును.. దీపిక అత‌నితో..!

గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్ తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  ఫైనల్ గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో […]

అవును.. దీపిక అత‌నితో..!
X

గ‌త కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్ తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో లెటెస్ట్ సెన్సేషన్ గా మారింది.

అయితే ఈ ఇద్దరు కలిసిన సందర్భం మాత్రం తెలియకపోయినా.. విన్ డీసిల్ హీరోగా తెరకెక్కనున్న ట్రిపులెక్స్ సీరీస్ నెక్ట్స్ పార్ట్ లో దీపిక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విన్ హీరోగా తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలోనే దీపిక హీరోయిన్ గా నటించాల్సి ఉన్నా, అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ అవడంతో చేయలేకపోయింది. దీంతో ఈ సారి విన్ డీసిల్ సరసన దీపిక నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

First Published:  9 Dec 2015 7:02 PM GMT
Next Story