Telugu Global
Others

డబ్బు వసూలుకు లైంగిక వేధింపులు- బెజవాడలో కాల్ దందా

విజయవాడలో దుర్మార్గపు వ్యాపారం బట్టబయలైంది. అప్పులిచ్చి ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. వందల కోట్ల టర్నోవర్‌తో సాగుతున్న వడ్డీ వ్యాపారం గుట్టు రట్టైంది. బెజవాడలోని బడాబాబులు, కొందరు రాజకీయనాయకులు కలిసి ఈ కాల్‌మనీ దందాకు తెరలేపారు. డబ్బు అవసరం ఉన్న వారు కాల్ చేస్తే చాలు వారే ఇంటికి వచ్చి డబ్బులిస్తారు. వడ్డీ తొలుత రూ. 5 అంటారు. డబ్బు కట్టడంలో ఆలస్యమైతే వడ్డీని పెంచుతూ రూ. 20కు తీసుకెళ్తారు. అప్పటికే డబ్బు కట్టడం బాధితులకు  అసాధ్యంగా మారుతుంది. డబ్బు […]

డబ్బు వసూలుకు లైంగిక వేధింపులు- బెజవాడలో కాల్ దందా
X

విజయవాడలో దుర్మార్గపు వ్యాపారం బట్టబయలైంది. అప్పులిచ్చి ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. వందల కోట్ల టర్నోవర్‌తో సాగుతున్న వడ్డీ వ్యాపారం గుట్టు రట్టైంది. బెజవాడలోని బడాబాబులు, కొందరు రాజకీయనాయకులు కలిసి ఈ కాల్‌మనీ దందాకు తెరలేపారు. డబ్బు అవసరం ఉన్న వారు కాల్ చేస్తే చాలు వారే ఇంటికి వచ్చి డబ్బులిస్తారు.

వడ్డీ తొలుత రూ. 5 అంటారు. డబ్బు కట్టడంలో ఆలస్యమైతే వడ్డీని పెంచుతూ రూ. 20కు తీసుకెళ్తారు. అప్పటికే డబ్బు కట్టడం బాధితులకు అసాధ్యంగా మారుతుంది. డబ్బు కట్టలేకుంటే మీ ఇంటిలోని ఆడవాళ్లను పంపించండి అంటూ వేధింపులకు దిగుతున్నారు. ఇలా వందలాది మంది కాల్ మనీ ముఠా బారిన పడ్డారు. అయితే జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక చాలా మంది లోలోన కుమిలిపోతున్నారు.

ఇటీవల ముఠాలో సభ్యుడిగా ఉన్న ఎలక్ట్రికల్ ఈఈ ఒక యువతిపై అత్యాచారం చేశారని తెలుస్తోంది. చదువు కోసం డబ్బు తీసుకున్న సదరు యువతిని పిలిపించుకుని లైంగిక దాడి చేశాడని సమాచారం. రూ. 50వేలకు సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టు రట్టైంది. రాత్రి దాడులు నిర్వహించిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో అర కేజీ బంగారం తాళిబొట్లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు వసూలు కోసం ఈ ముఠా ప్రత్యేకంగా 20 మంది బౌన్సర్లను పెట్టుకుంది. ఈ ముఠా నిత్యం విజయవాడలో 5 నుంచి 15 కోట్ల రూపాయల టర్నోవర్‌తో వడ్డీవ్యాపారం నడుపుతోంది. ఒక ప్రజాప్రతినిధి సోదరుడు ఈ దందా ద్వారా రెండు వందల కోట్లు సంపాదించినట్టు చెప్పుకుంటున్నారు. వీరి వద్ద అప్పు తీసుకున్న వారంతా చిన్నచిన్న పనులు చేసుకుని బతికేవారే. వారు డబ్బు చెల్లించలేని పక్షంలో బాధితుల కుటుంబాల్లోని మహిళలను వేధిస్తున్నారు. భౌతిక దాడులు చేస్తున్నారు.

First Published:  11 Dec 2015 12:18 AM GMT
Next Story