Telugu Global
Others

కేసీఆర్‌, చంద్రబాబు మధ్య డీల్ కుదిరిందని అగ్రనేతలే చెప్పారట!

ఇటీవల టీఆర్ఎస్‌లో చేరబోయి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న హైదరాబాద్ రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ గురించి ఆసక్తికరమైన ఆంశం వెలుగులోకి వచ్చింది. పార్టీలో చేరాల్సిందిగా ప్రకాశ్ గౌడ్‌ను కోరిన టీఆర్‌ఎస్ కీలక నేతలు కొన్ని విషయాలను ఆయనతో చెప్పారట. తెలంగాణలో ఇకపై టీడీపీ కార్యకలాపాలుండవని… ఈ మేరకు చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య ఒప్పందం కుదరిందని చెప్పారట. కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి […]

కేసీఆర్‌, చంద్రబాబు మధ్య డీల్ కుదిరిందని అగ్రనేతలే చెప్పారట!
X

ఇటీవల టీఆర్ఎస్‌లో చేరబోయి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న హైదరాబాద్ రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ గురించి ఆసక్తికరమైన ఆంశం వెలుగులోకి వచ్చింది. పార్టీలో చేరాల్సిందిగా ప్రకాశ్ గౌడ్‌ను కోరిన టీఆర్‌ఎస్ కీలక నేతలు కొన్ని విషయాలను ఆయనతో చెప్పారట. తెలంగాణలో ఇకపై టీడీపీ కార్యకలాపాలుండవని… ఈ మేరకు చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య ఒప్పందం కుదరిందని చెప్పారట. కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ప్రకాశ్‌ గౌడ్ చెప్పారని సమాచారం. ”మీకు కేసీఆర్‌కు మధ్య ఒప్పందం కుదరిందంట కదా సార్‌” అని నేరుగా అడిగేశారు. అంతేకాదు ”టీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా కోరుతున్నారు సార్.. వెళ్లాలా వద్దా” అని చంద్రబాబునే అడిగారట. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు అలాంటిదేమీ లేదన్నారట. టీడీపీని దెబ్బతీసేందుకు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని నమ్మవద్దని సూచించారు. అయినా నిజంగా డీల్‌ కుదరినా ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పగలరు? .

First Published:  11 Dec 2015 6:10 AM GMT
Next Story